ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

మేషం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వృషభం

వృషభం :ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం ఉంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

మిథునం

మిథునం :ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

కర్కాటకం

కర్కాటకం :ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీ అనుకున్న దానికన్నా ఎక్కువ డ్బ ఖర్చయ్యే అవకాశముంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచె శ్రద్ధ అవసరం.

సింహం

సింహం :ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు మీదపడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

కన్య

కన్య : స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, సంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోదయాత్ర చేస్తారు.

తుల

తుల :ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, వాహనం కొనుగోలు చేయడం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోకండి. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశమున్నది.

వృశ్చికం

వృశ్చికం :మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడడం, అలాగే సాయం చేస్తారు అన్నవారు కూడా సమయానికి మాట మార్చడంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతత కోసం పిల్లలతో గడపడం కానీ, వినోదకార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చేయడం మంచిది.

ధనుస్సు

ధనుస్సు :ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబసభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశమున్నది.

మకరం

మకరం :మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువుల అసహనానికి గురి చేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం

కుంభం : ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాట తీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండడం మంచిది. దాని వల్ల మీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది.

మీనం

మీనం :స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.