ఒంగోలులో ఈ రోజు పెద్ద వాన కురిసింది. బుుతుపవనాల రాకను చెప్పే తొలి వాన ఇది. అటుపక్క విజయవాాడలో వడగండ్లు పడ్డాయి. రాష్ట్రమంతా బుుతుపవనాలకు స్వాగతం పలికేందుకు సిద్దమయింది.
ఒంగోలు ఈ బుుతుపవనాల తొలి వానతో పులకిచింది. ఈ వాన కొద్ది సేపే అయిన జబర్దస్తీగా కురిసింది ఇలా... రేపో ఎల్లుండో ఆంధ్రలోకి బుుతుపవనాలు రానున్నాయి. ఈనెల 7, 8 తేదీల్లో కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని, అలాగే రానున్న నాలుగు వారాలు రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిపారు. ఈ రోజు ఆయన జలభద్రత గురించి అధికారులతో చర్చించారు.
విజయవాడలో వడగళ్ల వాన
