35 గొర్రెలను, గొర్ల కాపరిని మింగిన ఇసుక మాఫియా

First Published 19, Apr 2018, 5:32 PM IST
Tipper Lorry Hits Sheeps herd in Mancherial District
Highlights

ఇసుక లారీ ఢీకొని ఓ గొర్ల కాపరితో పాటు 35 గొర్రెలు చనిపోయిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు సబ్సిడీపై గొర్రెలనుఅందిస్తుంటే మరో వైపు ఇలా ఇసుక లారీల వల్ల ప్రమాదాలు జరిగి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేధన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయని వారిని అదుపు చేయాలని కోరుతున్నారు.

ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం భీమారం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామ శివారులోని కలప డిపో వద్ద ఈ ప్రమాదం జరిగింది.  రోడ్డు పక్క నుండి  వెళ్తున్న గొర్రెల మందపైకి ఓ ఇసుక లారీ మితిమీరిన వేగంతో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 32 గొర్రెలతో పాటు వీటి కాపరి మృతి చెందాడు.  మరో కాపరికి కూడా తీవ్రగాయాలవడంతో అతడిని స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. 

మృతి చెందిన గొర్రెలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో రహదారిపై రాకపోకలకు కొంత ఇబ్బంది కలిగింది.  ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అలాగే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
 
loader