అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై తెలుగోడి ‘గెలుపు’

this telugu guy wins trumps challenge
Highlights

యూఎస్ లో ఉద్యోగం చేస్తున్న భారతీయులను, ఇతర దేశస్తులను వెళ్లగొట్టేందుకు హెచ్ 1బి వీసాల జారీతో ట్రంప్ అధికారంలోకి రాగానే నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే.

దుందుడుకు చర్యలతో అమెరికాలో విద్వేశాలు రెచ్చగొడుతున్న ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ కు ఓ తెలుగు కుర్రాడు ధీటైన సమాధానం ఇచ్చాడు.

 

యూఎస్ లో ఉద్యోగం చేస్తున్న భారతీయులను, ఇతర దేశస్తులను వెళ్లగొట్టేందుకు హెచ్ 1బి వీసాల జారీతో ట్రంప్ అధికారంలోకి రాగానే నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే.

 

ఈ కొత్త నిబంధనల వల్ల తక్కువ జీతాలున్న ఉద్యోగాలు అమెరికాకే చెందుతాయి. అలాంటి ఉద్యోగాల్లో ఇతర దేశస్తులను తీసుకోరాదు. అలాగే, అత్యంత భారీ స్థాయి జీతాలున్న ఉద్యోగాలు అంటే స్కిల్డ్ ఉద్యోగాలకు మాత్రమే ఇతర దేశస్తులు అర్హులు.

 

ట్రంప్ తీసుకొచ్చిన ఈ నిబంధనతో ఇప్పటికే లక్షలమంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అమెరికాలోనే కాదు భారత్ లో ఉన్న బడా కంపెనీలు కూడా ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ తో ఉద్యోగులను ఇంటికి పంపించే పనిని పెట్టుకున్నాయి.

 

ప్రపంచమంతా ఇప్పడు వన్నా క్రై బారిన పడి ఎలా గగ్గోలు పెడుతుందో సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా ఇప్పుడు ట్రంప్ బారిన పడి అలాగే గగ్గోలు పెడుతున్నారు.

 

ఒక్క నిబంధనతో ట్రంప్ తమ భవిష్యత్తు కలలను నాశనం చేశాడని తెగ బాధపడిపోతున్నారు.

 

అయితే  ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటకు చెందిన ఇంటి దుర్గాలక్ష్మీనారాయణస్వామి మాత్రం ఇలా అందరి కుర్రాళ్లలాగా బాధపడకుండా ట్రంప్ కే షాకిచ్చాడు.

 

ఏడాదికి రూ. 2 కోట్ల జీతంతో  ట్రంప్ దేశంలోని మంచి ఉద్యోగం కొట్టేశాడు. అది కూడా యాపిల్ కంపెనీలో అనేక దశల పరీక్షలు నెగ్గి ఈ బంపర్ ఆఫర్ కొట్టేశాడు.

 

బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన ఈ కుర్రాడు ఆ తర్వాత అమెరికాలోని  వర్జినియా టెక్‌లో ఎంఎస్‌ పూర్తి చేశాడు. క్యాంపెస్ ప్లేస్ మెంట్ లోనే  యాపిల్‌ సంస్థలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఏడాదికి రూ. 2 కోట్ల వేతనంతో త్వరలో జాబ్ లో జాయిన్ కానున్నాడు.

loader