Asianet News TeluguAsianet News Telugu

ఇదో కులగజ్జి సాఫ్ట్ వేర్

కులరాజకీయాలు చేసే నేతాశ్రీలకు ఈ సాఫ్ట్ వేర్ వరంగా మారబోతోంది.

this software tell your community

ఎత్తులకు పై ఎత్తులు వేడయంలో మన రాజకీయ నేతలను మించిన వారు ఎవరూ ఉండరు. ఇటీవల కులం, మతం పేరుతో ఓట్లు అడగరాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కులం తెలియకుండా వారి ఓట్లను ఎలా అడగాలో నేతలకు తెలియడం లేదు. ఈ పెద్ద సమస్యను పరిష్కరించేందుకు వారికో సాఫ్ట్ వేర్ దొరికింది.

 

కులాల వారీగా జనాలను విడగొట్టే ఆ కొత్త సాప్ట్ వేర్ ఇప్పుడు ముంబై లో హాట్ కేక్ లా అమ్ముడుపోతుందట. అక్కడ బీఎంసీ ఎన్నికల్లో వివిధ వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎగబడి మరీ దీన్ని  కొంటున్నారట. తమ వార్డులలో ఉండే ప్రజల కులాలను ఈ సాఫ్ట్ వేర్ ద్వారా కనుక్కొని వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారట.

 

ఇంతకీ ఈ సాఫ్ట్ వేర్ ఎలా పనిచేస్తుందో తెలుసా...

ఎలక్షన్ కమిషన్ దేశంలోని ప్రతి ఓటరు వివరాలను తన వెబ్ సైట్ లో భద్రపరిచిన విషయం తెలిసిందే.  ఆ జాబితాను వివిధ రకాలుగా విశ్లేషించి ఓటర్ల కులాలను చూపెట్టేలా ఈ సాఫ్ట్ వేర్ ను కొందరు టెకీలు తయారు చేశారు. కేవలం కులం , మతం మాత్రమే కాకుండా  ఇంటి పేరు, అడ్రసును బట్టి కూడా ఓటర్లను ప్రత్యేకించి చూపేలా ఈ సాఫ్ట్ వేర్ ను తయారు చేశారట. అందుకే ఇప్పుడు  ఈ సాఫ్ట్ వేర్ కు బాగా డిమాండ్ వచ్చింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios