రోడ్లంటే భయపడేలా చేస్తున్నారు బలిసినోళ్ల పిల్లలు

This hyderabad deadly rich kid could not get away with hit and run
Highlights

అతగాడు రెండు పబ్ లలో పదివేల రుపాయ ల మందు లాగించాడు. అమ్మాయిలతో కలసి చిందులేశాడు. ఖరీదైనా కారెక్కి, అతి వేగంగా నడిపాడు.  తెల్లవారు జామున వాక్ కు వచ్చిన మాజీ సైనికుడు దేవదానాన్ని కొట్టేసి వెళ్లిపోయాడు.  శుభ్రంగా  కారును భాగాలు గా  విడగొట్టి షెడ్డు లో దాచేసి, కథ శుఖాంతం అనుకున్నాడు. కథ మరొక మలుపు తిరిగింది. అదే ఇది.

బలిసినోళ్ల పిల్లలు చేసే హిట్ రన్ కేసులకు దేశంలో లెక్కేలేదు.  ఇపుడు ఇది హైదరాబాద్ లో కూడా ఎక్కువుతున్నాయి.

 

ఒక నెల కిందట హదరాబాద్ లోని పబ్‌లలో తప్పతాగి, మైకం తలకెక్కిన యువకుడు మితిమీరిన వేగంతో కారు నడిపి ఒక మాజీ సైనికుడిని వెనకనుంచి కొట్ వెళ్లిపోయి, హమ్మయ్య , తప్పించుకున్నాననుకున్నాడు.

 

అయితే, కథ అక్కడి తో ఆగ లేదు. ఈ మాజీ సైనికుడి కుమారుడు హైదరాబాద్ లోనే ఒకపోలీసు అధికారి. తండ్రి ని చంపిన వ్యక్తిని ఏమయినా సరే పట్టుకుని తీరాలనుకున్నాడు. ఎవరికారది, ఎవరా వ్యక్తి,  ఎక్కడి పోయాడు, కారేమోయింది. ఎక్కడి నుంచి ఇటు వైపు వచ్చాడు ప్రశ్నలతో  దర్యాప్తు ప్రారంభించాడు.

 

విచారణలో తేలిందేమిటో తెలిస్తే మన కళ్లు బైర్లు కమ్ముతాయి.చనిపోయిన పెద్దాయన పేరు దేవదానం(72). మాజీ సైనికుడు. రిటైరయ్యాకు హైదరాబాద్ లో సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న కొడుకు దగ్గిర ఉంటున్నాడు. ఆయనకు రోజూ పొద్దునే లేచి వాక్ వెళ్లడం అలవాటు. ఆరోజు కూడా వాక్ లో ఉన్నపుడే ఈ కారు వచ్చి ఆయన్ని చంపేసింది. కారుతో ఢీకొట్టిన వ్యక్తి ఎంత అమానుషంగా  ప్రవర్తించాడంటే, కనీసం ఆగి, ఆయన పరిస్థితి ఏమయింది, ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలా అనే విషయం కూడా ఆలోచించకుండా వెళ్లిపోయాడు.

 

దీనికి సంబంధించి ఒక కేసును రాయదుర్గం పోలీస్ స్టేషన్లో  హిట్ అండ్ రన్ సంఘటన గా నమోదు చేశారు.

 

ఇపుడు దేవదానం కుమారుడు సిఐ రంగంలోకి దిగాడు. సిసి కెమెరాలలో రికార్డయిన కార్లన్నింటిని పరిశీలించాడు. ప్రమాదం జరిగిన రోడ్ల మీద ఉన్న 150 సీసీ కెమెరాల నుంచి ఫీడ్‌ తీసుకున్నారు. ఫోర్డ్‌ ఫిగో ఢీ కొట్టిందని అనుమానం వచ్చింది.

 

కెమెరాల ఫీడ్‌ ఆధారంగా వందలసంఖ్యలో ఉన్న ఫిగో కారు నెంబర్లను సంపాదించాడు.  అందులో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల అధారంగా మూడు కార్లమీద కన్నేశారు.వీటిలో  ఆరోజు అత్యంత వేగంగా ప్రయాణించిన కారు ఏదో చూశారు. కారు బయట పడింది. తండ్రిని పొట్టన పెట్టుకున్న కారు ఏమిటో తెలిసింది.

 

కథ ఇంతే కాదు, దీని వెనక వొళ్లు గగుర్పొడిచే విషయాలు, నగరంలో బలిసినోళ్ల పిల్లలలో ప్రవేశించిన విష సంస్కృతి ఉన్నాయి.

 

ఈ కారు 185 కిమీ వేగంతో వచ్చి దేవదానంను ఢీ కొంది. అంత వేగంగా కారును ఢీకొన్న వ్యక్తి ఇంజనీరింగ్ విద్యార్థి ప్రశాంత. సికింద్రాబాద్ కు చెందిన వాడు. ప్రమాదానికి ముందు రెండు పబ్ లలో పీకల్దాకా తాగాడు. ఇద్దరమ్మాయిలను వెంటేసుకున్నాడు.

 

ఒక పబ్‌లో అర్ధరాత్రి దాకా జల్సా చేసుకున్నాడు. తర్వాత  ఇంకో పబ్‌లో తెల్లవారుజామునరెండున్నర గంటలదాకా తాగుతూ ఉన్నాడు. అతనితో పాటు ఇద్దరమ్మాయు కూడా  ఉన్నారు.

 

ఆ మత్తులోనే గచ్చిబౌలిలో రోడ్డు పక్కన హోటల్‌లో ఇడ్లీలు తిన్నారు.  తర్వాత 5 గంటల సమయంలో ఇద్దరమ్మాయిలతో కలిసి  కారులో బయల్దేరాడు. కారు 185 కి.మీ. వేగం అందుకుంది. కైపులో కళ్లు కనబడటం లేదు. కారు అతివేగంగా వెళుతూ ఉంది. అదే మాజీ సైనికుడిని బలితీసుకుంది.

 

తర్వాత ఏమి జరిగిందో  ఇంకా ఆసక్తికరమదాచాడు.

 

పబ్ లలో విచారిస్తే, ఇతగాడు  10 వేల రుపాయ మందు లాగించాడు. మత్తుఅమ్మాయిలతో కలసి చిందులేసిన ఫుటేజీ పోలీసులు సంపాదించారు. వీటన్నింటి ఆదారంగా ప్రశాంత్ అరెస్టు చేశారు.

 

loader