ప్రస్తుతం చాలా మంది పని ఒత్తిడి వల్ల గాని, బీజీ లైఫ్ ఎఫెక్ట్‌ తో సెక్స్ లైఫ్ బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మ‌రి కొంతమందికైతే శృంగారం మీద సరైన ఆసక్తి కూడా ఉండ‌డం లేదు. అయితే.. ఈ సమస్యలకు పరిష్కారమే శృంగారం అంటున్నారు నిపుణులు. శారీర‌క సుఖంతో చాలా ఆరోగ్య స‌మస్య‌ల‌ను దీంతో అధిగ‌మించ‌వ‌చ్చు. సెక్స్ నిపుణులు కూడా ప్రతి రోజు సెక్స్ చేయ‌మ‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. ఇంతకీ లైంగిక వాంఛ, శక్తి పెరగడానికి తినాల్సినవి. ముఖ్యంగా మ‌హిళ‌లు తినాల్సిన‌వి ఏమిటో ఓసారి చూద్దాం. ఈ ఆహారం తీసుకుంటే మ‌హిళ‌ల్లో శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.

అరటి పండు ఎక్కువగా తీసుకోవడం వల్ల దీనిలోని పోటాషియం, విటమిన్ బి6 బాగా అంది ఆడ‌వారిలో లైంగిక జీవితం ఉత్సాహంగా ఉంటుంది.ఒక గ్లాస్ రెడ్ వైన్ వల్ల ఆడ‌వారిలో కూడా ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా  లైంగిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా మ‌గ‌వారిలో వీర్యకణాల సంఖ్య పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

కోడిగుడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్ బాగా అందుతుంది. ఆడ‌వారిలో లైంగిక వాంఛ పెరుగుతుంది. అదేవిధంగా మ‌గ‌వారిలో అంగస్తంభన సమస్యను కూడా దూరం చేస్తుంది. వెల్లుల్లి తింటే జననాంగాలకు రక్త ప్రసరణ బాగా అందుతుంది. అంగస్తంభన వంటి సమస్యలు మ‌గ‌వారిలోనూ దూరం అవుతాయి.