సోషల్ మీడియా స్నేహాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తున్నాయో తెలియజేసే సంఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. ఫేస్ బుక్ ద్వారా ఏర్పడ్డ పరిచయంతో ఓ యువతిని సినిమాకు తీసుకెళ్లిన యువకుడు, అందులోనే యువతిపై అత్యాచారం ఒడిగట్టాడు. ఈ సంఘటన సికింద్రాబాద్ లోని ప్రశాంత్ థియేటర్లో జరిగింది. 

మార్కెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనగాం జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన భిక్షపతి (23) తన సొంత గ్రామంలోనే ఉంటూ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు జగద్గిరి గుట్ట లో ఉండే తన చెల్లి వద్దకు తరచూ వెళుతుండేవాడు. ఈ క్రమంలో ఫేస్ బుక్ లో పరిచయమైన సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన (19) యువతి తో కలుస్తుండువాడు. అలా వీరి మద్య పరిచయం పెరిగింది.  ఇలా ఆ యువతిని మాటలతో బుట్టలో వేసుకునన్నాడు. 

ఎప్పటిలాగే గతనెల 28 న నగరానికి వచ్చిన భిక్షపతి, 29 ఉదయం యువతిని తీసుకుని మొదట ఇందిరాపార్కుకు వెళ్లాడు. అక్కడ కాసేపు గడిపాక మధ్యాహ్నం సికింద్రాబాద్‌ పాస్‌ఫోర్ట్‌ ఆఫీస్‌ వద్ద ఉండే ప్రశాంత్‌ థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లారు. అయితే థియేటర్లో ప్రేక్షకులు ఎక్కువగా లేకపోవడంతో ఇదే అదునుగా భావించి యువతిపై అత్యాచారానికి యత్నించాడు. యువతి ప్రతిఘటించే ప్రయత్నం చేసినా భిక్షపతి బలవంతం చేసి అత్యాచారం చేశాడు. దీంతో  ఆ యువతి ఇంటికి వెళ్లగానే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.