మరమ్మతులలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది.

గుంటూరులో మరమ్మతులలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. నంది వెలుగులో మణి హోటల్ వద్ద ఈ భవనం ఉంది. ఇటీవల రోడ్డు వెడల్పు చేస్తున్నపుడు భవనం సగం కూల్చాల్సి వచ్చింది. మిగతా భాగం రిపేర్లలో ఉండగా కూలిపోయింది. అయితే కూలిపోయే సూచనలు కనపించగానే కూలీలు భవనం ఖాలీ చేసి వెళ్లారు. దీనితో ప్రాణాపాయం తప్పింది.