పట్టపగలే ఆటో డ్రైవర్ పై కత్తులతో దాడి

First Published 16, Nov 2017, 2:14 PM IST
The assassination attempt on the auto driver in abdullapurmet area
Highlights
  • అబ్దుల్లాపూర్ మెట్ లో పట్టపగలే దారుణం
  • ఓ వ్యక్తిపై కత్తులతో దాడిచేసిన దుండగులు
  • గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమం

ఓ  ఆటోడ్రైవర్ ను పట్టపగలే కొందరు దుండగులు కత్తులతో నరికి కలకలం సృష్టించిన ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మొదట గోవర్దన్ నడిపే ఆటోను అడ్డుకున్నారు. అతడు ఆటో ఆపగానే ఒక్కసారిగా అతడ్ని ఆటోలోంచి బయటకు లాగి పక్కనే వున్న పొదల్లోకి తీసుకువెళ్లారు. అక్కడ తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో గోవర్ధన్ ను విచక్షణారహితంగా నరికారు. అనంతరం దుండగులు అక్కడినుంచి పారిపోయారని సాక్షులు తెలిపారు.  
అయితే ఈ గాయాలపాలైన ఆటోడ్రైవర్ ది ఎల్బీ నగర్ వాసుడిగా పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కక్షలే ఈ హత్యాయత్నానికి కారణమైఉంటుందని పోలీసులు బావిస్తున్నారు. ఇప్పటికే నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 
అయితే బాధితుడికి తీవ్ర గాయలవడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. 
 

loader