కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నుమూత గత  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బసవపున్నయ్య

తెనాలి మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. బసవపున్నయ్య స్వస్థలం కృష్ణాజిల్లా అవనిగడ్డ మండంలోని మోడుమూడి గ్రామం. ఆయన 1932లో జన్మించారు. ఆయన న్యాయవాదిగా కూడా పనిచేశారు.

1989లో కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి నియోజకవర్గానికి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. బసవపున్నయ్యకు పోటీగా.. ఆనాడు టీడీపీ తరపున ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పోటీ చేశారు.