Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ తో హైదరాబాద్ పోరగాళ్లకు కష్టాలు

H-1B విసాలను నిషేధించినా నష్టముండదని, యాపిల్, గూగుల్ వంటి సంస్థలు హైదరాబాద్ కే వస్తున్నాయని కెటిఆర్  అభయం

Telugus dollar dream is getting sour

తెలుగు వాళ్ల డాలర్ కల చెదరిపోయే  ప్రమాదం వచ్చిపడుతూ ఉందని  ప్రముఖ అమెరికా ఇంగ్లీష్ దినప్రతిక  వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

 

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన ట్రంప్ అధికారం చేపట్టగానే భారతీయుల పడమటి కిటికి మూతపడనున్నది. దీని వల్ల ఎక్కవ నష్టపోయేది తెలుగు రాష్ట్రాలేనని ఈ ప్రతిక వ్యాఖ్యానించింది.

 

వేలాది మంది భారతీయులను అమెరికా  తీసుకువెళ్లే H-1B వీసా విధానం పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందని ఈ పత్రిక పేర్కొంది. ట్రంపు, ఆయనకు అటార్నిజనరల్ కాబోతున్న జెఫ్ సెషన్స్ దీనికి రంగం సిద్ధం చేస్తున్నారు.

 

  H-1B వీసా అనేదొక  చవకబారు కూలీ విధానమని, ఈ వెసలు బాటు బాగా దుర్వినియోగం మయిందన్న ట్రంపు వ్యాఖ్యలను ఉటంకిస్తూ  ఈ విధానాన్ని పూర్తిగా రద్దుచేసేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయని  ఈ ప్రతిక వ్యాఖ్యానిచింది. అయితే,  H-1B వీసా లున్నా లేకున్నా, భవిష్యత్తులోఎదురు కాబోయే సమస్యను   అధిగమించే శక్తి హైదరాబాద్ కు వస్తున్నదని, హైదరాబాద్ ను యాపిల్, గూగుల్ వంటి సంస్థలు కేంద్రం చేసుకోవడం దీనికి సాక్ష్యం అని  తెలంగాణా ఐటి మంత్రి కె. టి రామారావు ఈ పత్రిక ప్రతినిధికి చెబుతూ హైదరాబాద్ పోరగాళ్లకి  అభయమిచ్చే ప్రయత్నం చేశారు.

 

ఈ విధానం వల్ల అమెరికా వెళ్లాలనుకుంటున్న టెకీలందరికి  డాలర్ కలలు భగ్నమవుతున్నా, ఎక్కువ నష్టం తెలుగు కుర్రవాళ్లకే నని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వాషింగ్టన్ పోస్ట్ ప్రతిక  హైదరాబాద్ డైట్ లైన్ తో “Trump and Sessions plan to restrict highly skilled foreign workers. Hyderabad says to bring it on “ ఒక కథనం అచ్చేసింది. H-1B వీసా తెలుగువాళ్ల తపస్సుకు  చిలుకూరి బాలాజీ సాక్షి అని  కూడా ఈ పత్రిక పేర్కొంది.

 

ప్రతిసంవ్సతరం దాదాపు లక్ష మంది ‘హైలీ స్కిల్డ్’ కాంట్రాక్ట్ వర్కర్లను అమెరికా  అనుమతిస్తుంది.ఇందులో ఎక్కువ మంది భారత్ నుంచే వెళుతుంటారు. ఇందులో  చాలా మంది అక్కడ ఎక్కువ సంవత్సరాలు పనిచేసి క్రమంగా గ్రీన్ కార్డు సంపాయిస్తారు. అమెరికా లో అందుబాటులో లేని స్కిల్స్ ని దిగుమతి చేసుకునేందుకు H-1B వీసా విధానమొదయింది. కచ్చితంగా ఇదే ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ వర్కర్లను అమెరికన్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారా అనే ది వివాదాస్పద అంశం. 

 

ఈనేపథ్యంలో ఇదొక ‘చవకబారు లేబర్ ప్రోగ్రాం’ అని ట్రంప్ వర్ణించాడు.ట్రంప్ , సెషన్స్ తీసుకువచ్చే మార్పులన్నీ ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి అవుట్ సోర్సింగ్ కంపెనీల మీద ఎక్కుబెట్టిన బాణాలే. తక్కువ జీతాలతో పనులు చేయించుకోవాలనుకునే అమెరికన్ కంపెనీలకు కాంట్రాక్ట్ వర్కర్లను సరఫరా చేసే ప్రధాన కంపెనీలివే.అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్  2013 లో  వీసా కుంభకోణాలకు సంబంధించి ఇన్ఫోసిస్  నుంచి 34 మిలియన్ డాలర్లను వసూలు చేసినసంగతిని పత్రిక ఉదహరించింది. తొందర్లో జస్టిస్ డిపార్ట్ మెంటు సెషన్స్ అదుపాజ్ఞలలో పనిచేస్తుంది.

 

తెలుగువాళ్ళు వీసా గురించి పడే తపన ఏమిటో , వీసాకోసం ఎదురుచూస్తున్న అమ్మాయొకరు వివరించారు. వీసా ఇప్పించమని దేవుని కోరేందుకు  చిలుకూరు వచ్చిన ఈ అమ్మాయి వాషింగ్టన్ పోస్ట్ విలేకరి  కంటపడింది. వీసా గురించి ఈ అమ్మాయిచాలా ఆందోళన చెందుతూ ఉంది.  వీసా వస్తుందో రాదో అనేది  నా తల రాత మీద అధారపడి ఉంటుందని చెబుతూనే  ఆమె భర్తతో కలసి బాలాజీ ప్రదక్షిణలు  చేస్తూ ఉంది. ఇది భారతీయుల విశ్వాసం అని వివరణ కూడ ఇచ్చింది. అయితే,రాకపోయినా నష్టం లేదు,  ఇపుడు ఇక్కడి కంపెనీలలోనే చాలా చాలా ఉద్యోగాలొస్తున్నాయని ఆమె తనకు తాను ధైర్యంచెప్పుకుంది.

 

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి  గిలిగిలిపెట్టే విధంగా, ఆయన తీసుకువచ్చిన విద్యా, పెట్టుబడుల విధానాల వల్లే సైబారాద్ ఎదిగిందని కూడా ఈ పత్రిక వ్యాఖ్యానించింది.ఇలాంటి ఈ వ్యాసం మధ్యలో చొరవడుతుందని కెటిఆర్ కూడా వూహించి ఉండరు.

 

Follow Us:
Download App:
  • android
  • ios