మానుషికి మిస్ వరల్డ్ వస్తుందని వారం కిందటే చెప్పింది

First Published 20, Nov 2017, 2:51 PM IST
telangana student met former miss america naina davuluri in US
Highlights
  • తెలంగాణ కుర్రాడితో నాటి మిస్ అమెరికా నైనా దావులూరి

‘‘మానుషి చిల్లార్’’. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు ఇది. 17ఏళ్ల తర్వాత భారత్ కి మిస్ వరల్డ్ కిరీటాన్ని మానుషి ద్వారా దక్కింది. అయితే.. మానుషికి మిస్ వరల్డ్ కిరీటం దక్కుంతుందని నాకు ఒక వారం రోజుల కిందటే తెలిసింది. ఏంటి మీరు నమ్మడం లేదా. నిజమండి.. 2014లో మిస్ అమెరికాగా నిలిచిన తెలుగుమ్మాయి నైనా దావులూరీ స్వయంగా నాకు  ఈ విషయం చెప్పింది.

అసలేం జరిగిందంటే.. నా పేరు అనీఫ్ పాషా. మాది తెలంగాణ రాష్ట్రమే. కాకపోతే ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాను. వారం రోజుల క్రితం బోస్టన్ లో ఇన్వెస్టర్స్ మీటప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారిలో డిప్లమాట్ కపిల్ సిబల్, ఫిల్మ్ మేకర్ రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా,క్రికెటర్ అజయ్ జడేజా, స్టాండప్ ఆర్టిస్ట్ రోషన్ జోషి, మాజీ మిస్ అమెరికా నైనా దావులూరి తదితరులు హాజరయ్యారు.అందులో నేనూ ఉన్నా, ఇదిగో పై ఫోటో సాక్ష్యం. నేను పనిచేస్తున్న కంపెనీ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. దవులూరి మనమ్మాయే కదా. అక్కడ ఆమె ఉండటం నాకు సంతోషమయింది. కొద్ది సేపు... కాదు చాలా సేపు తెలుగులో మాట్లాడుతకున్నాం.  

ఆ సమయంలో నైనా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మిస్ వరల్డ్ కిరీటం భారత్ కి దక్కుతుందని ఆమె చాలా హోప్ ఫుల్ గా  చెప్పారు. ఎలా చెబుతున్నారని అడిగాను.  ఆ పోటీలను నేను ట్రాక్ చేస్తున్నాను. అన్ని కోణాలనుంచి పరిశీలిస్తున్నాను. బాగా  దగ్గర నుంచి పరిశీలిస్తున్నాను. అందువల్ల  కచ్చితంగా మానుషీ చిల్లార్ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంటుందిని అనుకుంటున్నాను... అన్నారు. నేను అపుడు ఆశ్చర్యపోయిన మాట నిజమే. అయితే, చిల్లార్ పేరు వచ్చాక ఇంకా ఆశ్చర్య పోయాను.

 ఈ విషయంతోపాటు కల్చరల్ కాంపిటెన్సీ, ఫిలాంత్రోపీ, ఎంట్రప్రెనర్ షిప్, మహిళల హక్కులు తదితర విషయాల గురించి కూడా దవులూరి మాట్లాడారు. బ్యూటీ ఆఫ్ డైవర్సీటీనీ ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. ఆమె చాలా  బ్రిలియంట్. ఆమె సమాధానాలు నాకు మనవాళ్ల గొప్పదనం గురించి చెప్పాయి. అమెఅవగాహన తీరు అద్బుతం.

ఆ తర్వాత నేను నైనాని ...‘‘ మీరు దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? 60 ఏళ్ల మిస్ ఇండియా కాంపిటేషన్ చరిత్రలో ఈశాన్య భారతదేశానికి చెందిన ఒక్క యువతి కూడా ఎందుకు విజేతగా నిలవలేదు? అంటూ ప్రశ్నించాను.

అందుకు ఆమె సమాధానంగా ‘‘మన దేశంలో రేసిజమ్( జత్యాహంకారం) ప్రత్యేకమైన అర్థం ఉంది. భాష, కుల, మతపరమైన విభాగాలతో చుట్టుముట్టి ఉంది.  కానీ  విదేశాలలో ఉన్న వారు  నిజమైన భారతీయ సౌందర్యానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటారు. అది వాళ్లొక్కరి సొత్తే,’’ అని చెప్పుకొచ్చారు.

 

*అనీఫ్ పాషా వరంగల్ పోరగాడు. ఇపుడు  న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్నాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తుంటాడు. అనీఫ్ కు అల్ ద బెస్టు చెబుదాం

loader