తెలంగాణా డిజిపి ఎవరనేది ఐపిఎస్ ఆఫీసర్లలో కాకపుట్టిస్తున్నది. ఇపుడున్న డిజిపి అనురాగ్ శర్మ వచ్చేవారం రిటైరవుతున్నారు. ఆపదవిని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. తేజ్ దీప్ కౌర్ మెనాన్ (1983) రోడ్  అండ్ రైల్ సేఫ్టీకిచెందిన తెనేటి కృష్ణప్రసాద్ (1986)హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్ త్రివేది)1986)  మహేంద్ రెడ్డి( 1986) అంతా ఈ పోస్టు ఆశిస్తున్నారు. మహేందర్ రెడ్డిని డిజిపినిచేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇది కొందరిలో బాగా అసంతృప్తి రగిలించింది. ఇది  ఈ రోజు కృష్ణ ప్రసాద్ మాటల్లో వ్యక్తమయింది. ఆయన ఈరోజు అసెంబ్లీ దగ్గిర తన మనసులోమాటచెప్పారు. మహేందర్ రెడ్డితో పాటు అందరికి  అవకాశం కల్పించే విధంగా ఎంపిక ఉండాలని, అపుడు అంతా సంతోషిస్తారని, అలా కాకపోతే, కొందరు నిరుత్సాహ పడతారని అన్నారు.  డిజిపి పోస్టు ఆశిస్తున్నవారిలో  ఎ స్ సి వర్గానికి చెందిన అధికారి కృష్ణ ప్రసాద్ ఒక్కరే. ఆయన మనసులో ఉన్న మాటేమిటో చూడండి...  1

కొత్త డీజీపీ నియామకం కోసం రాజీవ్ త్రివేది ఫార్ములా బెటర్ అని డీజీ కృష్ణ ప్రసాద్ అసెంబ్లీ లాబీలో తన మనసులోని మాటన అక్కడ ఉన్న విలేకరులతో పంచుకున్నారు.

*కొత్త డీజీపీ నియామకం కోసం రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, సీఎంకు ఓ కొత్త ఫార్ములా ప్రతిపాదించారు.

*రాష్ట్రానికి సీఎస్ కావాలన్నది అందరు ఐఏఎస్ లకు, డీజీపీ కావాలన్నది అందరు ఐపీఎస్ లకు జీవితాశయంగా ఉంటుంది.

*సర్వీస్  లోకి వచ్చిన తొలినాళ్ళ నుంచే బ్యూరోక్రాట్లకు వాళ్ళ వాళ్ళ విభాగాల్లో అధిపతి కావాలనే ఆశయం ఉంటుంది.

*మహేందర్ రెడ్డికి ఐదేళ్లకు పైగా పదవీకాలం ఉంది.

*త్రివేది ఫార్ములా ప్రకారం, తనకు ఓ ఏడాది, రాజీవ్ త్రివేదికి రెండేళ్లు డీజీపీగా అవకాశం ఇచ్చి, మిగిలిన టెన్యూర్ అంతా మహేందర్ రెడ్డికి ఇస్తే, ఎలాంటి అభ్యంతరం లేదు.

*సీనియర్ ఐపీఎస్ ల టెన్యూర్, సుప్రీమ్ కోర్టు రెండేళ్ల నిబంధన, అధికారుల నిబద్ధత, వ్యవహార శైలి, బలాబలాలు, కేంద్ర సర్వీస్ నుంచి వాళ్ళు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు తదితర అంశాలను బేరీజు వేసుకుంటే 1986 బ్యాచ్ ఐపీఎస్లకే డీజీపీ పదవి దక్కే అవకాశం.

తెన్నేటి కృష్ణ ప్రసాదల్ 1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ఆయన వరంగల్ ఎన్ ఐటిలోబిటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత అహ్మదాబాద్  ఐఐఎం నుంచి  మేనేజ్ మెంట్ కోర్సు చేశారు.

1986 బ్యాచ్ లో మొదట రిటైరయ్యేది కృష్ణ ప్రసాదే. ఆయన పుట్టిన తేదీ మార్చి, 2 1960. రాజీవ్ తేదీ పుట్టిన  తేదీ 19.9.1961. మహేందర్ రెడ్డి 3.12.1962. కాబట్టి, మహేందర్ రెడ్డి కొంత కాలం ఆగవచ్చనేది రాజవ్ త్రివేది  ఫార్ములా. అయితే, డిజిపి , చీఫ్ సెక్రటెరీ నియమాలు అందరిని ఆకామిడేట్ చేద్దామనేలా జరగవు. ఎవరు ఇష్టంలేదో వాళ్లని ఎలిమినేట్ చేస్తారు. అది అందరికి తెలిసిందే. కృష్ణ ప్రసాద్ ను నియమిస్తే,ఆయన తెలంగాణ రాష్ట్రానికి తొలి ఎస్ సి వర్గానికి చెందిన డిజిపి అవుతారు. ఇది ఈ వర్గాలను సంతృప్తి పరిచే అవకాశం ఉంది.