ముఖ్యమంత్రి చంద్రబాబు సై అంటే కేంద్రంపై యుద్ధానికి సిద్ధమని అనంతపురం జెసి దివాకర్‌ రెడ్డి అన్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్ర అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన  బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్ కు తీరని అన్యాయం జరిగిందనిఆమయన ఆరోపించారు. అంతేకాదు,  ఎన్ డిఎ నుంచి తెలుగుదేశం పార్టీని తరిమొందుకు బిజెపి పొమ్మనలేక పొగ పెడుతున్నట్ల ఉందని అని ఆయన ఒకతీవ్రమయినవ్యాఖ్య చేశారు.
‘ఆంధ్రాకు ఎలాంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు.  అర కొర రాల్చి నిధులిచ్చి సాయం చేశామంటున్నారు. అదెట్లా?’ అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా, తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలపై,  కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావనే లేక పోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సాయమంతా నామ మాత్రంగానే ఉంది,’ అని జెసి అన్నారు.
టీడీపీ మాత్రమే కాదు దేశంలోని అన్ని పార్టీలు ఈ బడ్జెట్‌పై నిరాశ, నిస్పృహలతో ఉన్నాయని అన్నారు. 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కి చాలా  సహనం ఉందని ఆయన చాలా ఓపికగా ఉన్నారని చెబుతూ ఆయన సై అంటే తామంతా కేంద్రంతో ఈ అన్యాయానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు సిద్ధమని అన్నారు.