టీడీపీ పార్టీ నేతలు రోజురోజుకీ దారుణంగా తయారౌతున్నారు. అధికారంలో ఉన్నది తమ పార్టీనే కదా.. ఎమి చేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా.. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేస్తూ వార్తల్లొకి ఎక్కేవారు. తాజాగా.. మరో విషయంలో హాట్ టాపిక్ గా మారారు. అమ్మాయిలతో రికార్డు డ్యాన్స్ లు చేస్తూ.. అడ్డంగా దొరికిపోయారు.

అసలేం జరిగిందంటే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం అంబర్ పేట గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడి లోకల్ లీడర్ ఒకరు ఆదివారం పుట్టినరోజు జరుపుకున్నాడు. తన పుట్టిన రోజు వేడుకకి ఇతర టీడీపీ నేతలను కూడా ఆహ్వానించాడు. వారంతా కలిసి.. ఒక బోగం మేళం సెట్ చేసుకున్నారు. అమ్మాయిలతో రాత్రంతా డ్యాన్సులు వేశారు. కాగా.. వీళ్ల డ్యాన్సులను వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా వైరల్ గా మారాయి. వీడియోలు చూసిన వారంతా టీడీపీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.