Asianet News TeluguAsianet News Telugu

పోస్ట్ గ్యాడ్యుయేట్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెడుతున్న టీఏపీఎంఐ

  • టీఏపీఎంఐ( టీ.ఏ పై మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్) తాజాగా హ్యుమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెడుతోంది.
  • ఎస్ హెచ్ ఆర్ ఎమ్( సొసైటీ ఆఫ్ హ్యుమన్ రిసోర్స్) తో కలిసి ఈ ప్రోగ్రామ్ ని ప్రవేశపెడుతున్న టీఏపీఎంఐ
TAPMI launches postgraduate program in Human Resource Management

ప్రముఖ ఎడ్యుకేషనల్ సొసైటీ టీఏపీఎంఐ( టీ.ఏ పై మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్) తాజాగా హ్యుమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెడుతోంది. ఎస్ హెచ్ ఆర్ ఎమ్( సొసైటీ ఆఫ్ హ్యుమన్ రిసోర్స్) తో కలిసి ఈ ప్రోగ్రామ్ ని ప్రవేశపెడుతున్నట్లు టీఏపీఎంఐ సంస్థ డీన్ ప్రొఫెసర్ సైమన్ జార్జ్ చెప్పారు. ఇటీవల ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ పీజీ ప్రోగ్రామ్ విజయవంతం అయిన తర్వాత తమ సంస్థ విద్యార్థులు పీజీ డిప్లమా అందజేస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఎస్ హెచ్ ఆర్ ఎం గ్లోబల్ సర్టిఫికేషన్ పొందడానికి కూడా విద్యార్థులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రోగ్రామ్ లో శిక్షణ పొందిన విద్యార్థుల్లో న్యాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని, ఎనలిటిక్స్ ఉపయోగాలు తెలుసుకోగలుగుతారని, పారిశ్రామిక సంబంధాలు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మెరుగుపడతాయని వివరించారు.

టీఏపీఎంఐ లీడర్ షిప్ అసెస్ మెంట్ అండ్ డెవలప్ సెంటర్ పర్యవేక్షణలో విద్యార్థులకు న్యాయకత్వ లక్షణాలు మెరుగుపడేలా చేస్తామని చెప్పారు. అంతేకాకుండా సోషల్ సెక్టార్ లోని అధునాతన ప్రజెక్టుల ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రస్తుత ధోరణులపై పూర్తి అవగాహన కలిగేలా చేస్తామన్నారు. కార్పొరేట్ హెచ్ ఆర్ మేనేజ్ మెంట్ లో పరిశోధనలు చేయడంపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. దాని ద్వారా హెచ్ ఆర్ రంగంలో వారి నైపుణ్యం బహిర్గతం అవుతాయని.. దీంతో వాళ్లు ఆ రంగంలో ప్రొఫెషనల్స్ గా తయారౌతారన్నారు.

తమ టీఏపీఎంఐ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ నూతన హెచ్ ఆర్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీన్ వివరించారు. అనంతరం సంస్థ చైర్ హెచ్ ఆర్ జేమ్స్ మాట్లాడుతూ..  భారత్ లో ఎస్ హెచ్ ఆర్ ఎం తో కలిపి పనిచేస్తున్న  ఏకైక సంస్థ తమదేనని చెప్పారు. ఇందులో పీజీ పూర్తి చేసే విద్యార్థులకు రెండు సర్టిఫికెట్లు అందుతాయన్నారు.హెచ్ ఆర్ రంగంలో నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. అదేవిధంగా 2018-2020 బ్యాచ్ కోసం ప్రవేశాలను కూడా స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios