తెలంగాణా పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాగా కోపమొచ్చింది,కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మీద. మొన్న రాహుల్ గాంధీ సభ కోసం  హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ మంత్రి మీద ఒక రాయేశారు.  అది బాగా తగిలింది. మియాపూర్ భూముల కుంభకోణంలోకి ఆయన తలసాని పేరు లాగారు. ఇది తనపరువుకు నష్టం అంటున్న తలసాని.

తెలంగాణా పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాగా కోపమొచ్చింది,కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మీద. మొన్న రాహుల్ గాంధీ సభ కోసం హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ మంత్రి మీద ఒక రాయేశారు. అది బాగా తగిలింది.

తెలంగాణా ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న మియాపూర్ భూముల దొంగ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ఆయన మంత్రిగారిని ఇరికించేశారు. ఈ కుంభకోణంలో తలసానిశ్రీనివాస యాదవ్ కు ప్రమేయం ఉందని చెప్పారు.

తెలంగాణా పత్రికలలో ఈ కుంభకోణం గురించి, దాని వెనకన ఉన్న పెద్ద మనుషుల గురించి కొంత రాస్తున్నా, దాస్తున్నదే ఎక్కువగా ఉంది. పెద్దలప్రస్తావన వచ్చినపుడు ‘ఒక సీనియర్ మంత్రి’ అని తప్పకుంటున్నాయి పత్రికలు.

ఈ సీనియర్ మంత్రి పేరు తెలిసేదెలా?

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ కు అబాధ్యత అప్పగించింది. ఆయన ఎకంగా తలసాని శ్రీనవాస యాదవ్ పేరు చెప్పేశారు. ఇదే తలసాని కోపానికి కారణం.మియాపూర్‌లోని భూముల కబ్జాల విషయంలో తన ప్రమేయం ఉందని చెప్పిన దిగ్విజయ్‌ సింగ్‌పై పరువు నష్టం దావా వేస్తున్నానని తలసాని ప్రకటించారు. రూ.10 కోట్ల పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్‌ కేసు పెడతానని సచివాలయం లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

‘25 ఏళ్ల నుంచి రాజకీ యాల్లో కొనసాగుతున్నా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా. ఇట్టాంటి చరిత్ర ఉన్న నన్ను, వ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసినందుకు దిగ్విజయ్‌పై దావా వేస్తున్నా. లాయర్ల ద్వారా ఆయనకు లీగల్‌ నోటీసులు కూడా జారీ చేసినా. పరువు నష్టం దావాలో రూ.10 కోట్లు వస్తే ఏదో ఒక ట్రస్టుకు విరాళమిస్తా,’నని కూడా అన్నారు.