బిజెపికి యశ్వంత్ సిన్హా గుడ్ బై: మోడీపై తీవ్ర వ్యాఖ్యలు

బిజెపికి యశ్వంత్ సిన్హా గుడ్ బై: మోడీపై తీవ్ర వ్యాఖ్యలు

పాట్నా: సీనియర్ నేత యశ్వంత్ సిన్హా బిజెపికి గుడ్ బై చెప్పారు. చాలా కాలంగా ఆయన బిజెపి పట్ల అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

పార్టీ రాజకీయాల నుంచి తాను సన్యాసం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బిజెపితో అన్ని రకాల బంధాలను తెంచుకుంటున్నట్లు చెప్పారు. పాట్నాలో శనివారం జరిగిన రాష్ట్ర మంచ్ సంస్థ సమావేశంలో ఆయన తన రాజకీయ సన్యాసం గురించి ప్రకటన చేశారు. 

ఈ సమావేశంలో కాంగ్రెసు, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడీ) నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అందరి దృష్టీ మరో బిజెపి అసంతృుప్త నేత శతృఘ్ను సిన్హాపైనే నిలిచాయి. 

యశ్వంత్ సిన్హా 1998 - 2004 మధ్య కాలంలో అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖలను నిర్వహించారు. 2014 ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని బిజెపి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత ఎల్కే అద్వానీతో పాటు యశ్వంత్ సిన్హా తదితర సీనియర్ నాయకులను పక్కన పెడుతూ వచ్చారు 

యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఉన్నారు. తాను పార్టీని వీడేది లేదని యశ్వంత్ సిన్హా ఫిబ్రవరిలో చెప్పారు. తన విమర్శలకు తనను పార్టీ గంటేస్తే తప్ప బిజెపిని వీడేది లేదని చెప్పారు 

2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని యశ్వంత్ సిన్హా విమర్శించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos