స్వీడిష్ మోడల్ కి బెదిరింపులు.. ఎందుకో తెలుసా?

స్వీడిష్ మోడల్ కి బెదిరింపులు.. ఎందుకో తెలుసా?

సెలబ్రెటీలు వేసుకునే డ్రస్సులపై నెటిజన్లు కామెంట్లు గుప్పించడం లాంటి సంఘటనలు ఇప్పటి వరకు మనం చాలానే చూశాం. ఇలాంటి ఘటనే ఓ స్వీడిష్ మోడల్ కి కూడా ఎదురైంది. కాకపోతే.. కాస్త డోస్ పెంచి మరీ నెటిజన్లు ఆమెను రేప్ చేస్తామంటూ కూడా బెదిరించారు. దీంతో.. తానపై జరిగిన దాడిని ఆ మోడల్ సోషల్ మీడియాలో తెలియజేసింది.

 

అసలేం జరిగిందంటే..ప్రముఖ స్వీడిష్ మోడల్ అర్విదా బైస్ట్రోమ్ పేరు ఎప్పుడైనా విన్నారా.. ఆమె చాలా టీవీ ప్రకటనలు చేశారు. అయితే.. కొంతకాలం క్రితం ఆమె చేసిన ఓ ప్రకటన ఆమెకు తిప్పలు తెచ్చిపెట్టాయి. ఆ ప్రకటన చూసిన పలువురు ఆమెను రేప్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

26ఏళ్ల అర్విదా.. అడిడాస్ కంపెనీ కి అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చింది. అందులో ఆమె తన కాళ్లను షేవ్ చేసుకోలేదు(కాళ్లకు వెంట్రుకలు ఉన్నాయి). దీంతో ఆ  ప్రకటన విడుదలైన నాటి నుంచి ఆమెకు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు రావడం మొదలుపెట్టాయి. కొందరు అసహ్యంగా తిడుతూ కామెంట్ చేయగా.. మరికొందరు ఏకంగా రేప్ చేస్తామంటూ కామెంట్లు చేశారు. దీనిపై ఇటీవల అర్విదా  సోషల్ మీడియా వేదికగా స్పందించింది.  తనను రేప్ చేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని చెప్పింది.ఆ బెదిరింపులు చూశాక ఈ ప్రపంచం నుంచి పారిపోవాలని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ ప్రకటనకు సంబంధించిన తన ఫోటోని ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోస్ట్ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. కాగా.. ఆమె పోస్టుకి చాలా మంది మద్దతు తెలిపారు. ఒక అమ్మాయి.. ఎలా కనిపించాలనుకుంటుందో అది పూర్తిగా తన వ్యక్తిగతమని కొందరు కామెంట్ చేయగా.. మహిళలకు అవాంచిత రోమాలు ఉండటం సహజమని మరికొందరు కామెంట్ చేశారు

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos