రాజ‌కీయాల్లోకి రావాల‌నుకున్న న‌టులు ఎన్టీఆర్ ను ఆద‌ర్శంగా తీసుకోవాలి

న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పై చేసిన శ్రీపీఠం అధినేత స్వామి ప‌రిపూర్ణానంద‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.కమల్ ఈ మధ్య ‘హిందూ’ వ్యతిరేక ధోరణి తీసుకోవడం మీద స్వామీజీవ్యాఖ్యానించారు. తమ పాతపాచిక పారకపోవడంతో హిందూ సంస్థలు ఈ మధ్య హింసను అయుధంగా వాడుకుంటున్నాయని ఆయన ఈ మధ్య ఆనంద వికటన్ అనే తమిళ పత్రికలో రాసి సంచలనం సృష్టించారు. ఇది స్వామి పరిపూర్ణానందకు ఆగ్రహం తెప్పించింది.

‘నీ సినిమాలను హిందువులు చూస్తేనే గొప్ప‌న‌టుడిగా ఎదిగావు.-రాజ‌కీయంలో ఎద‌గ‌డానికి హిందువుల‌ను దుయ్య‌బ‌డుతున్నావు. హిందువులను దుయ్యబడితే నాయ‌కులు అవుతారా?,’ అని స్వామీజీ ప్రశ్నించారు.క‌మ‌ల్ నువ్వు లోక‌నాయ‌కుడిగా కాదు..లోక‌ల్ నాయ‌కుడిగా కూడ ప‌నికి రావు అని అని స్వామీ పరుష వ్యాఖ్యచేశారు.‘ నువు క‌మ‌ల్ హాస‌న్ కాదు.క‌మాల్ హ‌స్స‌ేన్ ఉగ్ర‌వాది ’ అని కూడా ఆయన అన్నారు.

హిందువుల‌ను తీవ్ర‌వాదుల‌న్న వాళ్లు క‌చ్చితంగా ఉగ్ర‌వాదులే స్వామిప‌రిపూర్ణానంద‌ ప్రకటించారు.క‌మ‌ల్ వేషం వెనుక విషం ఉందని అంటూ సినిమాలు తీసేట‌ప్పుడు హిందువులు కావాల్సి వ‌చ్చింది.నీ క‌ట్టిన బ‌ట్ట‌,నివాసం,సుఖ‌భోగాల‌తో కూడుకున్న జీవ‌న‌విధానం హిందూస‌మాజానిది కాదా అని స్వామిజీ ప్రశ్నించారు.హిందూమ‌తాన్ని కించ‌ప‌రిచి,క‌మ‌ల్ ధ‌ర్మ‌ద్రోహిగా మారాడని అన్నారు.

స్వామీజీ చేసిన మరిన్ని పరుష వ్యాఖ్యలివి:

*తీసిన సినిమాలు ఫ్లాప్ అవుతుండ‌టంతో క‌మ‌ల్ కు పిచ్చిప‌ట్టింది.

*ఎన్టీఆర్ లాంటి మ‌హాన‌టుడు రాజ‌కీయాల్లోకొచ్చినా..హిందూధ‌ర్మాన్ని ఆచ‌రిస్తూ ఇత‌ర మ‌తాల‌ను గౌరవించారు

*రాజ‌కీయాల్లోకి రావాల‌నుకున్న న‌టులు ఎన్టీఆర్ ను ఆద‌ర్శంగా తీసుకోవాలి

*హిందూమ‌తంపై చేసిన వాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకోక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేస్తే సంహార ప్ర‌క్రియ‌ను క‌మ‌ల్ చూస్తారు