Asianet News TeluguAsianet News Telugu

ఎవరెస్టు ఎత్తు మళ్లీ కొలుస్తున్నారు

150 సంవత్సరాల తర్వాత ఎవరెస్టు శిఖరం ఎత్తు కొలిచేందుకు భారత దేశం పూనుకుంటున్నది

Survey of India to remeasure the height of Everest

 ఎవరెస్టు శిఖరం ఇప్పటి ఎత్తెంత?

 

ఎపుడో  కొలిచిన చెప్పిన పాత లెక్క కాదు, ఇప్పుడు,2017 నాటి ఎత్తు ఎంత?

 

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు భారత సర్వేక్షణ సంస్థ (సర్వే ఆఫ్ ఇండియా) చర్యలు తీసుకుంటూ ఉంది.

 

ఈ మధ్య నేపాల్ లో భారీ భూకంపం వచ్చాక, ఎవరెస్టు శిఖరం  ఎత్తులోమార్పు వచ్చిఉంటుందని సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి. అందువల్ల ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఒక సర్వేచేయడం అవసరం అని ఈ సంస్థ  భావిస్తూ ఉంది. ఈ విషయాన్ని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా, స్వర్ణ సుబ్బారావు వెల్లడించారు. శాస్త్రవేత్త ల మధ్య ఈ పర్వతం ఎత్తు కుంచించుకుని పోయిందనే అనుమానం ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు.

 

’మొదటి సారి ఎవరెస్టు శిఖరం ఎత్తు ప్రకటించింది 1855 లో. ఆతర్వాత చాలా మంది కూడా ఎత్తును కొలిచారు. ఈ ఎత్తునే ఇప్పటికి ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ లెక్క ప్రకారం  ఎవరెస్టు శిఖరం ఎత్తు 29,028 అడుగులు. అయితే, ఇపుడు మేం మళ్లీ కొలవాలనుకుంటున్నం. తొందర్లోనే  ఒక బృందాన్ని  అక్కడి పంపిస్తున్నాం,‘అని ఆయన హైదరాబాద్ లో చెప్పారు.

 

ఎత్తు గురించి అనుమానాలు నివృత్తి కావడమే కాదు, భూగర్భ ప్లేట్ కదలికల వంతి శాస్త్రీయ విషయాలను అధ్యయనం చేసేందుకు కూడా కొత్తగా కనుగొనే ఎత్తు పనికొస్తుంది.

 

తమ పని మొదలుపెట్టేందుకు అవసరమయిన అనుమతులన్నింటిని భారత  ప్రభుత్వం నుంచి, నేపాల్ నుంచి కూడా సంపాదించడం జరిగిందని కూడా ఆయన చెప్పారు.

 

ఈ కార్యక్రమం ఒక నెలలో ముగుస్తుందని, తర్వాత సేకరించిన కంప్యుటేషన్ కోసం, తర్వాత ఎత్తును కచ్చితంగా ప్రకటించేందుకు మరొక 15 రోజులు పడుతుందని ఆయన చెప్పారు.





 

Follow Us:
Download App:
  • android
  • ios