ఆంధ్రలో తెలుగు మీడియం రద్దుకు విద్యార్థులు వ్యతిరేకం విజయవాడలో తరగతుల బహిష్కరణ జివొ ఎంఎస్ 14 ఉపసంహరణకు డిమాండ్
జూలై 14,2017న విజయవాడ రాజరాజేశ్వరి పేటలోని కేర్ & షేర్ హైస్కూల్ పాఠశాల విద్యార్థులు తెలుగు మీడియం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరంతా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఆందోళనకు దిగారు.పాఠశాలలో తెలుగు మీడియం రద్దు చేయవద్దని నినాదాలు చేస్తూ క్లాసులు బహిష్కరించారు. తెలుగుమీడియం రద్దుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం వస్తున్నది. ఈ రోజు యస్ యఫ్ ఐ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చెప్పట్టారు. మునిసిపల్ శాఖ మంత్రి పి నారాయణ కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.
1 నుండి 10 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం విద్యాబోధన రద్దు చేయడానికి వీలులేదని డిమాండ్ చేశారు.
తెలుగు మీడియం విద్యాబోధన రద్దు చేయడానికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 14 ను తక్షణమే రద్దు చేయాలని, విద్యార్థులకు తక్షణమే తెలుగు పాఠ్యపుస్తకాలను ఇవ్వాలని వారు కోరుతున్నారు.
