కర్నూల్ టిడిపి నాయకుడు ఏవి సుబ్బారెడ్డిపై రాళ్లదాడి

Stones Attack On TDP Leader AV Subba Reddy At Kurnool
Highlights

ఇది భూమా వర్గం పనేనా?

కర్నూలు జిల్లాలో అధికార టీడీపీ నేతల సైకిల్‌ యాత్రలో గందరగోళం నెలకొంది. ఇవాళ టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి చేపట్టిన సైకిల్ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈయనపై ప్రత్యర్థులు రాళ్ల దాడికి తెగబడ్డారు. సుబ్బారెడ్డి సైకిల్ యాత్రలో పాల్గొనడానికి వస్తుండగా ఈయన ప్రయాణిస్తున్న వాహనం పై ప్రత్యర్థులు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటన సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల మిట్ట దగ్గర ఘటన జరిగింది. అయితే ఈ దాడిలో సుబ్బారెడ్డికి గానీ మిగతా కార్యకర్తలకు కానీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. 

భూమా నాగిరెడ్డి మృతితో కర్నూల్ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అప్పటివరకు ఒకటిగా వున్న ఎవి సుబ్బారెడ్డి, భుమా వర్గం ఒక్కసారిగా దూరమయ్యారు. ఇక భూమా అఖిల ప్రియ మంత్రిగా మారినప్పటి నుండి ఈ విభైదాలు తారా స్థాయికి చేరాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఇద్దరిని పిలిచి సయోధ్య కుదిర్చారు. అయితే ఈ ఘటనతో మరోసారి వీరి విబేధాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ దాడికి పాల్పడింది ఎవరో తెలియకపోయినప్పటికి ఇది ఖచ్చతంగా భూమా వర్గం పనేనని సుబ్బారెడ్డి అనుచరులు అభిప్రాయపడుతున్నారు. దఈ దాడిపై టాడిపి అధినేతకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. చంద్రబాబు మీటింగ్ తో గొడవలు సద్దుమణిగాయని అనుకుంటున్న వేళ  ఈ తాజా ఘటనతో మరోసారి కర్నూల్ టిడిపిలో అలజడి మొదలయ్యింది.


 

loader