రెండు వికెట్లు కోల్పోయిన లంక నాలుగు మార్పులతో రంగంలోకి దిగిన టీం ఇండియా. ఇప్పటికే 4-0 ముందున్న ఇండియా.

కొలంబో వేదికగా శ్రీలంక-భారత జట్ల మధ్య చివరి వన్డేలో లంక రెండు వికెట్లు కోల్పోయింది. ఠాకుర్ బౌలింగ్ లో మున్వీర్ అవుట్ అయ్యాడు. అంతకుముందు భువనేశ్వర్ బౌలింగ్ లో డిక్వెల్లా క్యాచ్ అవుట్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది శ్రీలంక‌. భార‌త్ పలు మార్పులతో రంగంలో దిగింది. లంక‌ టూర్ లో ఉన్న అంద‌రికి స్థానం క‌ల్పిస్తామ‌ని గ‌త మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లీ వెల్ల‌డించారు. అందుకు అనుగుణంగా ఐద‌వ వ‌న్డేలో ఏకంగా నాలుగు మార్పులు చేశారు. ఓపెన‌ర్ దావ‌న్ స్థానంలో అజింక్యా ర‌హానే కు స్థానం ద‌క్కింది. కెద‌ర్ జాద‌వ్, భువ‌నేశ్వ‌ర్‌, యుజువేంద్ర చౌహాల్‌ల‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు.

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి