సోనీ ఎక్స్ పీరియా నుంచి లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్

First Published 7, Feb 2018, 5:39 PM IST
sony launches new smart phone xperia l2 with new features
Highlights
  • సోనీ ఎక్స్‌ పీరియా ఎల్2 పేరిట ఈ ఫోన్ ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ సోనీ  నూతన స్మార్ట్‌ ఫోన్ ని విడుదల చేసింది. సోనీ ఎక్స్‌ పీరియా ఎల్2 పేరిట ఈ ఫోన్ ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎక్స్‌ పీరియా ఎల్ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇది. ఇందులో డ్యుయల్ సిమ్‌తోపాటు మెమొరీ కార్డు కోసం ప్రత్యేకంగా స్లాట్ ఇచ్చారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. బ్లాక్, గోల్డ్ రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ రూ.19,990 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. 

సోనీ ఎక్స్ పీరియా ఎల్2 ఫీచర్లు..

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 

1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 

1.5 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 

3 జీబీ ర్యామ్, 

32 జీబీ స్టోరేజ్, 

256 జీబీ ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్, 

ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, 

13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 

3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

loader