రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి నేత సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి బాగా లేకపోవడం వల్లనే ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించారని, పరిస్థితులు బాగా లేకనే 2004లో చంద్రబాబు అలిపిరి కనిపించిందని ఆయన అన్నారు.

2004లో చంద్రబాబుకు ఏమైందే 2019లో కూడా అదే జరుగుతుందని, అందులో ఏ విధమైన సందేహం లేదని ఆయన శనివారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ప్రజకోర్టులోనే చంద్రబాబు సంగతిని తేలుస్తారని అన్నారు. 

ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడిన తీరు ప్రజాస్వామికంగా లేదని అన్నారు. ప్రభుత్వ అధినేత, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ప్రధానిని తూలనాడిన విధానం, వాడిన భాష దారుణమని అన్నారు. 

నిజాయితీపరుడైన మోడీకి రాష్ట్రంలో జరుగుతున్న అవమానాలు తమను చిన్నబుచ్చుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో శాసనసభ్యుడు బాలకృష్ణ మాట్లాడిన తీరు దారుణంగా ఉందని అన్నారు. 

రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులు దుర్వినియోగమయ్యాయని అన్నారు. ఈ అత్మవంచనకు తమ పార్టీ తగిన సమాధానం చెబుతుందని అన్ారు .ఈ ఏడాది కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యతను బిజెపి స్వీకరించిందని చెప్పారు.