Asianet News TeluguAsianet News Telugu

లైంగికంగా వేధిస్తున్నారని.. రైలు నుంచి దూకేసింది..

  • యువతి చెన్నైలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.
  • . కొందరు పురుషులు ఆమె పట్ల  అసభ్యంగా ప్రవర్తించారు.
Software employee jumps off moving train in a bid to escape from molesters

 

 లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని.. ఓ సాఫ్ట్ వేర్  ఉద్యోగిని కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..విజయవాడకు చెందిన షేక్ నజ్ బుల్లా(21) అనే యువతి చెన్నైలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. గురువారం తన స్నేహితుల తో కలిసి చైన్నై నుంచి తమ స్వస్థలానికి బయలు దేరింది.  వారు రైలులో ప్రయాణిస్తుండగా.. కొందరు పురుషులు ఆమె పట్ల  అసభ్యంగా ప్రవర్తించారు. లైంగికంగా వేధించడం మొదలు పెట్టారు.

ఆ పురుషుల్లో ఒకరు యువతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. మరొకరు దానిని సెల్ ఫోన్లలో చిత్రికరించడం మొదలుపెట్టారు. దీంతో తోటి ప్రయాణికులను రక్షించాల్సిందిగా కోరగా.. ఎవరు ముందుకు రాలేదు. దీంతో వారు వేధింపులు తాళలేక ఆ యువతి సింగరాయ కొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి కిందకు దూకేసింది.

 వెంటనే అప్రమత్తమైన ఆమె స్నేహితులు.. రైలు చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. గాయాలపాలైన ఆమెను స్టేషన్ మాష్టర్ సహాయంతో ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆమెను లైంగికంగా వేధించిన వారిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios