హైదరాబాద్ కృష్ణానగర్‌లో బాంబు పేలుళ్లు

హైదరాబాద్ కృష్ణానగర్‌లో బాంబు పేలుళ్లు

హైదరాబాద్ లో సినీ ఆర్టిస్టులు ఎక్కువగా నివాసముండే కృష్ణా నగర్ లో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. వరుసగా మాడు సార్లు బాంబులు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారు జామున జరిగి ఈ పేలుళ్ల దాటికి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. 

ఈ పేలుళ్లకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణానగర్‌ లోని ఓ ఇంట్లో బాలకృష్ణ అనే మూవీ ఆర్టిస్ట్ అద్దెకుంటున్నాడు. ఇతడు సినిమాల్లో బాంబులు పేల్చడంలోనూ, ఈ సన్నివేశాల్లోనూ డూప్ గా నటిస్తుంటాడు. ఇందుకు అవసరమయ్యే పేలుడు పదార్థాలను అదే ఇంట్లోని ఓ గదిలో భద్రపరిచేవాడు. ఇదే ఇంట్లో ప్రొడక్షన్‌ విభాగంలో పనిచేసే అశోక్‌(28) కూడా అద్దెకుంటున్నాడు. అయితే  ఈ పేలుడు పదార్థాలు నిన్న తెల్లవారుజామున హటాత్తుగా పేలాయి. ఈ పేలుళ్ల సమయంలో ఈ ఇంట్లో అశోక్ ఒక్కడే ఉండటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన ఇతడు మొదటి అంతస్తులోంచి పక్క భవనంలోని బాల్కనీలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ పేలుడు సమయంలో అశోక్ తప్ప ఎవరూ లేకపోవడంతో తీవ్ర ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ఇలా అక్రమంగా పేలుడు పదార్థాలను నివాసాల మద్యలో దాచి ప్రమాదానికి కారణమైన బాలకృష్ణ పరారీలో ఉన్నాడు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos