Asianet News TeluguAsianet News Telugu

ఈ సమయంలో సిల్వరే గోల్డ్

ఆర్థిక అస్థిరత ఉన్నప్పుడు బంగారం కంటే వెండిని కొనుగోలు చేయడమే తెలివైన నిర్ణయమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

 

 

silver is the best option to purchase now

 

పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్థవ్యస్థమైంది. అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఇక సామాన్యుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

 

దేశ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైనప్పుడు కరెన్సీ విలువ కూడా భారీ ఒడిదుడుకులకు లోనవడం సహజం. ఇది అన్ని దేశాలలోనూ ఉంటుంది.

 

కొన్ని దక్షిణాఫ్రికా దేశాలలో అయితే ఆర్థిక వ్యవస్థ పతనం వల్ల కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది.

కేజీల కొద్ది డబ్బులిచ్చి గ్రాముల్లో వస్తువులు తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు.

 

అయితే మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. కానీ, లావాదేవీలు సరిగా లేక ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది.

 

ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు.

 

విలువైనది, ఎక్కువ స్థిరత్వం ఉన్నది కాబట్టి అందరూ పుత్తడి కొనుగోలుకే ఓటేస్తారు.

 

భారత్ లో బంగారం అనేది మదపుకోసమే కాదు సెంటిమెంట్ గా భావించే ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

అయితే విదేశాల్లో ఈ పరిస్థితి లేదు. అక్కడ బంగారాన్ని కేవలం పెట్టుబడి వస్తువుగానే చూస్తారు.

 

అయితే బంగారం అంతటి విలువ లేకపోయిన ఇలాంటి సమయంలో వెండి కొనుగోలు చేయడమే సరైన నిర్ణయమని  ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

 

 

బంగారం తో పోల్చి చూస్తే వెండి ధర చాలా తక్కువ దీని వల్ల భారీ మొత్తంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

 

ప్రస్తుతం 10 గ్రాము బంగారం ధర 26, 922 ఉంటే కిలో వెండి ధర కిలో వెండి ధర 38, 956 గా ఉంది.

 

అలాగే, బంగారం కంటే వెండి రేట్ల పెరుగుదల విషయంలో అస్థిరత్వం ఎక్కువగా ఉంటుంది.


అందువల్ల కాస్త రిస్క్ తీసుకునేవారైతే వెండి మీద ఇన్వెస్ట్ చేయడమే తెలివైన ప్రత్యామ్నాయం అనేది

నిపుణులు సూచన.

 

దేశంలో బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టినట్లు వెండి కొనుగోళ్లపై పెట్టకపోవడం మరో ముఖ్యమైన అంశం.

 

బంగారంలాగా వెండిలో గోల్ మాల్ చేసే అవకాశం చాలా తక్కువ.. ఇవన్నీ చూస్తుంటే ఇది నిజంగా సిల్వర్ టైం అనిపించడం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios