న్యూ ఇయర్ రోజే ఢిల్లీ, జార్ఘండ్ సీఎంలకు చేదు అనుభవంఒకరిపై బూటు, మరొకరిపై చెప్పు విసిరిన ఆగంతకులు

న్యూ ఇయర్ రోజే దేశంలో ఇద్దరు సీఎంలకు చేదు అనుభవం ఎదురైంది. అందులో ఒకరి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాగా, మరొకరు జార్ఘండ్ ముఖ్యమంత్రి సీఎం రఘుబార్ దాస్‌.

ఆదివారం హర్యానాలోని రోహ్తక్‌ వచ్చిన కేజ్రీవాల్ పెద్ద నోట్ల రద్దుపై ఓ ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపైకి బూటు విసిరాడు. అయితే అది కేజ్రీవాల్‌కు తగలకుండా కొంచెం దూరంలో పడింది. ఇంతకీ షూ విసిరిన వ్యక్తిని ఎవరు గుర్తించకపోవడం గమనార్హం.

జార్ఖండ్ సీఎం రఘుబార్ దాస్‌ కూడా ఈ ఏడాది తొలిరోజు ఇలాంటి అనుభవమే ఎదుర్కొన్నారు.

ఖార్వా జిల్లాలోని షాహిద్ పార్కులో పోలీస్ కాల్పుల్లో మృతి చెందినవారికి సంతాపంగా గిరిజనులు ఆదివారం ఓ కార్యక్రమం నిర్వహించారు. సీఎం ఇందులో పాల్గొని మృతులకు నివాళి అర్పించారు. అయితే సీఎం రాకను వ్యతిరేకించిన కొందరు వ్యక్తులు ఆయన నివాళి అర్పించి వెళుతుండగా చెప్పులు విసిరారు.