ఆన్ లైన్ ఖాతాదారులు ఎస్ బి ఐ షాక్

sbi shocking news on online banking
Highlights

  • ఈ వ్యాలెట్ లకు ఇక ట్రాన్సాక్షన్లు ఉండవ్

 

దేశమంతా క్యాష్ లెస్ కు మారాలి... నగదురహిత లావాదేవీలే జరపాలని కేంద్రం చట్టాలు తీసుకొస్తుంటే.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఆన్ లైన్ బాట పట్టిన తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది.

 

తమ బ్యాంకు ఖాతాదారులు ఆన్‌లైన్‌లో ఈ వ్యాలెట్‌కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడం ఇక పై కుదరదని ఎస్ బి ఐ ప్రకటించింది. ఈ మేరకు నిధుల బదలాయింపును నిలిపేస్తున్నట్లు

పేర్కొంది.

 

సైబర్‌ దాడులు, ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు.

పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత మళ్లీ బదలాయింపులు పునరిద్దరిస్తామని తెలిపారు.

 

అయితే పే టీఎం, ఫ్రీ రిచార్జ్ తదితర సంస్థలు దీన్ని తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఎస్ బీ ఐ తమ బడ్డీ యాప్ కు వినియోగదారులను పెంచుకునేందుకే ఈ చర్యలు తీసుకుందని విమర్శిస్తున్నాయి.

 

కాగా, ఇప్పటికే 80లక్షల మంది ఎస్‌బీఐ బడ్డీ యాప్‌కు వినియోగదారులుగా ఉన్నారు.

loader