పేటీఎం వాడకంపై ఎస్ బీ ఐ వార్నింగ్

sbi distances from paytm
Highlights

  • ఇక ఎస్ బీ ఐ నుంచి పేటీఎంకు నగదు బదిలీ ఉండదు

పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా గగ్గోలు పెడుతుంటే పేటీఎం మాత్రం పండగ చేసుకుంటోంది.

 

దేశం క్యాష్ లెస్ గా మారాలంటే పేటీఎం ఉపయోగించాల్సిందే నని పే...ద్ద.. స్థాయిలో ప్రచారం కూడా చేస్తోంది.

 

అయితే పేటీఎం దూకుడుకు ఎస్ బీ ఐ ఊహించని రీతిలో కళ్లెం వేసింది.

 

ఆన్ లైన్ లో పేటీఎం కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఎస్ బీ ఐ కొత్త వ్యూహాలు రచిస్తోంది.

 

ఇందులో భాగంగా  ఆన్‌లైన్‌ ద్వారా పేటీఎంలోకి డబ్బులు పంపడాన్ని  ఎస్ బీ ఐ పూర్తిగా రద్దు చేసింది.

 

ఇకపై తమ వినియోగదారులు తమ ఎం వ్యాలెట్ యాప్ ‘బడ్డీ’నే వాడుకోవాలని సూచిస్తోంది.

 

ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ నుంచి పేటీఎంకు డబ్బులు నింపడాన్ని నిలిపివేశాం.. అని ఎస్ బీ ఐ తాజాగా ట్వీట్‌ చేసింది.  

loader