ఈ క్రికెటర్ శాతకర్ణి ని కూడా చూడండి

RP Singh throws fans mobile when asked for a selfie
Highlights

గుండెల నిండా అభిమానం పెంచుకొని ఒక్క సెల్ఫీ కోసం వెళితే గుండెల మీదే తంతుతున్నారు కొందరు సెలబ్రెటీలు.  

అభిమానులు కాస్త జాగ్రత్త...

 

గౌతమీపుత్ర శాతకర్ణి తో బాలకృష్ణ రికార్డు క్రియేట్ చేశాడు. 100 వ చిత్రాన్ని తన సినీ కెరీర్ లో మరిచిపోలేని విజయంగా మలుచుకున్నారు. అయితే ఇటీవల బాలకృష్ణ ఓ థియేటర్లో సినిమా చూసి వస్తుండగా ఆయన వీరాభిమాని ఒకరు సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నించారు. ఎందుకో మరి అది బాలయ్యకు చిరాకు తెప్పించింది.

 

అభిమాని అని కూడా చూడకుండా ఫోన్ ను నెట్టేసి కంటిచూపుతో అతడిని చంపేసే పనిచేశాడు.

సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. అభిమాని పట్ల బాలయ్య ప్రవర్తించిన తీరుపై చాలా మంది నొచ్చుకున్నారు.

 

ఇది మరవక ముందే అలాంటి పనే చేసిన ఓ టీంఇండియా క్రికెటర్ సోషల్ మీడియాలో బ్యాడ్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

 

గత డిసెంబర్ 13 ను ఓ రంజీ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న బౌలర్ ఆర్ పీ సింగ్ తన తో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు.

 

 

గ్రౌండ్ ను బయటకు వచ్చిన ఆర్పీ అభిమాని సెల్ ఫోన్ ను లాగి మైదానంలో విసిరేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


గుండెల నిండా అభిమానం పెంచుకొని ఒక్క సెల్ఫీ కోసం వెళితే గుండెల మీదే తంతుతున్నారు కొందరు సెలబ్రెటీలు.  

అభిమానులు కాస్త జాగ్రత్త...

 

loader