మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇంట్లో చోరీ

First Published 18, Nov 2017, 1:42 PM IST
robbery in formar cbi jd and ips officer jd lakshmi narayanas house
Highlights
  • ఐసీఎస్  అధికారి లక్ష్మీ నారాయణ ఇంట్లో చోరీ
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సీనియర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇంట్లో శనివారం చోరీ జరిగింది. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు ఇంట్లో పనిచేసే వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

loader