Asianet News TeluguAsianet News Telugu

రెడ్ మీ5 వచ్చేస్తోంది

  • . రెడ్ మీ5 , రెడ్ మీ5 ప్లస్ పేరిట ఈ ఫోన్ ని భారత మార్కెట్ లోకి విడుదల చేస్తోంది.
Redmi 5 India Launch Date Expected as February 14 as Xiaomi Sends Media Invites

చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ షియోమి.. మరో నూతన స్మార్ట్ ఫోన్ ని ప్రవేశపెడుతోంది. రెడ్ మీ5 , రెడ్ మీ5 ప్లస్ పేరిట ఈ ఫోన్ ని భారత మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. ప్రేమికుల రోజు ( ఫిబ్రవరి14)న ఈ ఫోన్ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేకంగా ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి.. అందులో ఈ ఫోన్ విడుదలచేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఫోన్ ధరలను మాత్రం సీక్రెట్ గా ఉంచింది. ఫోన్ విడుదల రోజే.. ధర కూడా ప్రకటించే అవకాశం ఉంది.

రెడ్ మీ5 ఫోన్ ఫీచర్లు..

5.7ఇంచెస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్ మీ5 ప్లస్ ఫోన్ ఫీచర్లు..

5.99 ఇంచెస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Follow Us:
Download App:
  • android
  • ios