Asianet News TeluguAsianet News Telugu

గంగలో కలిసిన ఆర్బిఐ పరువు

పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీలే  ఆర్బిఐ పరువు తీసి పుణ్యం కట్టుకున్నారు.

RBI loosing its sheen

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పరువు పోతోందని పాపం పెద్దాయన వైవి రెడ్డి ఆందళన పడుతున్నారు. నిజమే కదా! గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్బిఐ పరువు గంగలో కలిసిపోయింది. పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీలే  ఆర్బిఐ పరువు తీసి పుణ్యం కట్టుకున్నారు.

 

ఏకపక్షంగా పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని తర్వాత తలెత్తిన పరిణామాలకు మాత్రం రిజర్వ్ బ్యాంకును జవాబుదారుగా నిలబెట్టారు. దాంతో ప్రధాని నిర్ణయాన్ని సమర్ధించలేక, క్షేత్రస్ధాయి సమస్యలను పరిష్కరించలేక రిజర్వ్ బ్యాంకు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొత్త నోట్ల ముద్రణ సక్రమంగా జరగలేదు. జరిగినదానిలో అనేక లోపాలు, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా సరిపడా నోట్ల సరఫరా కావటం లేదు.

 

కోట్లాది మంది జనాలు బ్యాంకులు, ఏటిఎంల ముందు 2 వేల నోటు కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతుంటే కొందరు కుబేరులకు మాత్రం వాళ్ళ ఇళ్ళకే కోట్ల రూపాయల కొత్త నోట్లు నడిచి వెళిపోతోంది. ఇదంతా చూస్తున్న సామాన్యజనం ఆర్బిఐ మీద మండిపడుతున్నారు. దాదాపు 200 మంది క్యూలైన్లలోనే ప్రాణాలు సైతం వదిలేసారు కదా?

 

దేశంలోని జనాలు ఎవరు గతంలో ఆర్బిఐ గురించి అణుమాత్రం కూడా ఆలోచించే వారు కాదు. ఎందుకంటే, వారికి అవసరం లేదు. కానీ మోడి పుణ్యమా అంటూ ఇపుడందరి నోళ్ళలోనూ ఆర్బిఐ నానుతోంది. ఇది మాత్రం పూర్తిగా మోడి, జైట్లీల ఘనకార్యమే.

 

ఇదే విషయమై పెద్దాయన వైవి రెడ్డి ఆందోళన పడుతున్నారు. ఆర్బిఐకి 11 ఏళ్ళు డిప్యుటీ గవర్నర్, గవర్నర్ హోదాలో పనిచేసిన రెడ్డిగారు బాధపడటంలో ఏమాత్రం తప్పులేదు. ఆర్బిఐ తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాలు కూడా బయటే తీసేసుకుని అమలును మాత్రం బ్యాంకుకు వదిలిపెడుతున్నారని ఆందోళన చెందుతున్నారు.

 

పైగా అంతర్జాతీయ సంస్ధలు కూడా ఆర్బిఐపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం క్షేమకరం కాదంటున్నారు. జరుగుతున్న పరిణామాల వల్ల ఆర్బిఐ పేరు, ప్రతిష్ట దెబ్బతింటోందని వాపోతున్నారు. అయితే, ఆర్బిఐ పేరు, ప్రతిష్టలు దెబ్బతినటానికి ప్రతిపక్షాలో, ప్రజలో కారణం కాదు కాదా? స్వయానా ప్రధానమంత్రే ఆ పనికి పూనుకుంటే రెడ్డిగారో లేక మరొకరో బాధపడితే ఉపయోగమేమిటి?

Follow Us:
Download App:
  • android
  • ios