Asianet News TeluguAsianet News Telugu

నోట్ల రద్దు ఆర్ బీ ఐ కి ఎప్పుడు తెలుసంటే...

ఆర్ బీ ఐ  ఆమోదంతోనే కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

rbi know one day before about the demonetization

 

నల్లధనం నిర్మూలనకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

 

అయితే కేంద్ర కేబినెట్ తో చర్చించకుండా కనీసం ఆర్ బీ ఐ ని కూడా సంప్రదించకుండా మోదీ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

 

అయితే పెద్ద నోట్ల రద్దు ప్రకటనపై కేంద్రం ఆర్ బీ ఐ కి ముందే సూచించిందట.

 

 

నోట్ల రద్దుపై ఒక రోజు ముందే కేంద్ర ప్రభుత్వం ఆర్ బీ ఐ కి సమాచారం అందజేసినట్లు పార్లమెంటరీ కమిటీకి ఆర్‌బీఐ అందజేసిన నివేదికలో పేర్కొనడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 

 

దొంగనోట్లు, ఉగ్రవాదులకు నిధులు, నల్లధనం సమస్యలను అడ్డుకునేందుకు నోట్లను రద్దు చేయాల్సిందిగా ఆర్‌బీఐకి కేంద్రం సలహా ఇచ్చింది. దీనికి ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు వెంటనే ఆమోదం తెలిపింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios