హైదరాబాద్ లో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు వదలడంలేదు. ఏదో వంకతో ఏకంగా ఇంట్లోకి ప్రవేశించి ఒంటరి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు,. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లోని బాచుపల్లిలో చోటుచేసుకుంది. 

కూకట్ పల్లి పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ వాషింగ్ మిషన్ రిపేరు కోసం ఓ సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేసింది. ఆ సంస్థ ఈ రిపేర్ కోసం పవన్ తేజ్ అనే మెకానిక్ ను ఆ మహిళ తెలిపిన అడ్రస్ కు పంపించారు. అయితే ఇంట్లో మద్యాహ్నం సమయంలో ఆ వివాహిత ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ఈ కామాంధుడు ఆమెపై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాషింగ్ మిషన్ ను సరిగ్గా రిపేర్ చేయకుండానే వెళ్లిపోయాడు. ఇలా పలుమార్లు రిపేరు పేరుతో ఆ ఇంటికి వెళ్లేవాడు.

ఇలా ఓ వారం రోజులు గడిచిన తర్వాత ఆ గృహిణిపై అత్యాచారానికి ఫ్లాన్ చేశాడు.  మిషన్ బాగు చేసే నెపంతో మరో సారి ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న ఆమెపై మత్తుమందు చల్లాడు.  దీంతో స్పృహ కోల్పోయిన ఆమెను అత్యాచారం చేస్తూ సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆ తర్వాత కూడా ఈ వీడియోను బైటపెడతానని బయపెట్టి పలుమార్లు అత్యాచారం చేశాడు. అలాగే బెదిరింపులకు దిగి 35 వేల నగధును కూడా ఆమె నుండి తీసుకున్నాడు.ఇలా అతడి ఆకృత్యాలు ఎక్కువవుతుండటంతో సదరు మహిళ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కామాంధుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.