కులూమనాలీలో పర్యటిస్తున్న పాల్వాయ్ గుండెపోటుతో ఈరోజు ఉదయం మరణించారు.
తెలంగాణా సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి కన్నుమూసారు. కులూమనాలీలో పర్యటిస్తున్న పాల్వాయ్ గుండెపోటుతో ఈరోజు ఉదయం మరణించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన పాల్వాయ్ మొదటిసారి 1967లో ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత మంత్రి హాదాలో పలుశాఖలను నిర్వహించారు. ఐదుసార్లు ఎంఎల్ఏగానే కాకుండా ఎంఎల్సీగా కూడా పనిచేసారు. పార్లమెంట్ సభ్యుని హోదాలో పలు కమిటీల్లో కూడా పనిచేసారు. పార్లమెంటరీ కమిటీ సభ్యుని హోదాలోని ప్రస్తుతం పాల్వాయ్ కులూమనాలీలో పర్యటిస్తున్నారు. పాల్వాయ్ కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఢిల్లీ నుండి కులూమనాలీకి చేరుకోగానే పాల్వాయ్ కు అస్వస్తత మొదలైంది. అయితే, ఆసుపత్రిలో చేర్చగానే గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో పక్కనే భార్య కూడా ఉన్నారు.bi: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గోవర్ధన్ రెడ్డి తో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు.
పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయి తో పాటు హాజరైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో సీఎం మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కులు లో చనిపోయిన పాల్వాయి మృత దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వ పరంగానే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి ఎస్ పి సింగ్ , ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ను సీఎం ఆదేశించారు. మృత దేహం తరలింపు తో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎంపీ లు కె. కేశవ రావు, జితేందర్ రెడ్డి లను సీఎం కోరారు.

నల్లగొండ రాజ్యసభ సభ్యడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి స్వగ్రామం చండూరు మండలము ఇడికుడ...నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, రాజీవ్ గాందీ, సోనియా గాంధి, రాహుల్ గాంధీ వరకు ...గాంధీ కుటుంబం తో లాయల్ గా పాల్వాయి...యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ను వదలని పాల్వాయి...దీనికి గుర్తించే రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ..ఈ ఎడాదితో ఆయన పదవీ కాలం ముగియనుంది.

1967 లో మొదటి సారి ఎంఎల్ ఎ గా గెలిచారు,అది కూడా మొదటి ప్రయత్నంలొనే. భవనం వెంకట్ రామ్ కాబినెట్ లో, విజయ భాస్కర్ రెడ్డి కాబినెట్ లో మంత్రి గా పని చేశారు. ఒక కుమారుడు ప్రేమిందార్ రెడ్డి.భవనం వెంకట్ రామ్ కాబినెట్ లో, విజయ భాస్కర్ రెడ్డి కాబినెట్ లో మంత్రి గా పని చేశారు.
ఉత్తమ్ దిగ్భ్రాంతి
పాల్వాయి మరణం పట్ల పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరం విషయమని అన్నారు.
పాల్వాయ్ మరణం తెలంగాణ కాంగ్రెస్ కు తీరని నష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
.నెహ్రూను నుండి రాహుల్ వరకు పార్టీకి ప్రజలకు సేవలు అందించిన నేతగా ఉత్తమ్ ఆయన్నికొనియాడారు.
ఆమోస్ సంతాపం
గోవర్ధన్ రెడ్డి అకాల మృతిపట్ల మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కె ఆర్ ఆమోస్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనకుటుంబానికి ఆమోస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోవర్ధన్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర సాధన విషయంలో తీవ్రంగా పోరాడారని, ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఎపుడూ రాజీ ధోరణి అవలంభించలేదని ఆమోస్ కొనియాడారు.
