వచ్చే తెలంగాణా డిజిపి ఎవరనే దాని  మీద  ఐపిఎస్ ఆఫీసర్ల మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1986 బ్యాచ్ ఐపిఎస్ ఆపీసర్లంతా డిజిపి కావాలని ఆశిస్తున్నారు. అపై సీనియర్లు కూడా కొందరు ఈ పోస్టు మీద ఆశలుపెట్టుకున్నారు. అయితే, ప్రభుత్వం సీనియారిటి పాటించాలని  చాలా మంది ఐపిఎస్ ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డు గా చెబుతూ పైకి చెప్పేందుకు జంకుతున్నారు. ఎందుకంటే, డిజిపి పోస్టు రాకుంటేమానే, రిటైరయ్యాక ఏదో అడ్వయిజర్ పోస్టయినా దొరుకుతుందని వారి ఆశ.  అందువల్ల ఎవరూ పైకి ముఖ్యమంత్రి కెసిఆర్ కు సలహా లిచ్చేలా లేరు.

ఇలాంటపుడు నిన్న 1986 బ్యాచ్ కు చెందిన అధికారి తెన్నేటి కృష్ణ ప్రసాద్ మీడియాకెక్కారు. ఆయన ముఖ్యమంత్రి ఏమి చేయాలో చెప్పారు. దానికోసం ఆయన ప్రస్తుతం హోం శాఖప్రిన్సిపల్ కార్యదర్శి అయిన రాజీవ్ త్రివేది పేరు వాడారు. త్రివేది ఒక ఫార్ములా ముఖ్యమంత్రికి అందించారని, ఆ ఫార్ములా పాటిస్తే 1986 బ్యాచ్ అధికారులంతా కుషీ అవుతారని వారు ఆయన చెప్పారు. వివాదం ఎందుకొస్తున్నదంటే,  ముఖ్యమంత్రి ఇదే బ్యాచ్ కు చెందన కెకె మహేందర్ రెడ్డిని డిజిపి గా నియమించనందుకు సుముఖంగా ఉన్నారని వార్తలు వెలవడ్డమే. అయితే, రాజీవ్ త్రివేది ఈ రోజు కృష్ణ ప్రసాద్ చెప్పిన ‘ త్రివేది ఫార్ములా’ ను కొట్టి పడేశారు. 

కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలకు రాజీవ్ త్రివేది కౌంటర్ ఇస్తూ, అలాంటి ఫార్ములా లేదని చెప్పారు. ఆయన చెప్పిన మూడు ముక్కలివి:

* నేను ఎవరికీ ఎటువంటి ఫార్ములా సూచించలేదు.

*ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రతిపాదన ఇవ్వలేదు.

*డీజీపీ నియామకం పూర్తిగా సీఎం విచక్షణాధికారం.

*నాపేరును నాకు సంబంధం లేని వ్యక్తులు మీడియా ముందు ప్రస్తావించారు.

‘లాబీలో ఆ అధికారి చేసిన వ్యాఖ్యలకు, నాకూ ఎలాంటి సంబంధం లేదు.

ఇపుడు కృష్ణ ప్రసాద్ ఏమంటారో చూడాలి.

రాజీవ్ త్రివేది ఫార్ములా రచ్చకెక్కడం కృష్ణ ప్రసాద్ నియమాకావకాశాలు లేవనే అనుకోవాలి.

రాజీవ్ త్రివేది పేరు ను ప్రస్తావించి, ముఖ్యమంత్రికి ఆయన రాజీ ఫార్ములా ఇచ్చారని మీడియాకు చెప్పడం పట్ల ఐపిఎస్ అధికారుల్లో హాటాట్ చర్చ సాగుతూ ఉంది.

ఇప్పటికే ఒక దళిత ఐఎఎస్ అధికారి  ప్రదీప్ చంద్ర చాలా అసంతృప్తిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా రిటైరయ్యారు. ఆయన ఎక్సెటన్షన్ సరిగ్గా కృషిజరగలేదని చెబుతారు.

ఈపుడు ఒక దళిత ఐపిఎస్ అధికారి కూడా అసంతృప్తితో రిటైరవబోతున్నారనే అనుకోవాలి.