ఏడు కోట్ల తమిళ ప్రజలను రజనీకాంత్ నిరాశపర్చరు. నేనెపుడూ రజనీకాంత్ ఇంత టెన్షన్ లో ఉండటం చూడలేదు ఎఐఎడిఎంకె నాయకురాలు జయలలిత మరణం తర్వాత, తమిళప్రజల భవిష్యత్తుగురించి ఆయన తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. రాజకీయాలలోకి రావాలని ఆయన మీద ప్రజలనుంచి, అభిమానుల నుంచి తీవ్రవత్తడి ఉంది: బహదూర్
సూపర్‌స్టార్ రజనీకాంత్ బాగా టెన్షన్ లో ఉన్నారు. రాజకీయాలలోకి దూకాలా వద్దాఅనే విషయం మీద ఆయన తీవ్రంగా యోచిస్తున్నారు. గతంలో ఎపుడూ రజనీని ఇంత టెన్షన్ తో సతమత మవడం చూడలేదని బహదూర్ అనే ఆయన మిత్రుడొకరు చెబుతున్నారు. బహదూర్ సాధారణ సినిమాలోకం స్నేహితుడు కాదు.1970 దశకంలో, రజనీకాంత్ కర్నాటక ఆర్టీసిలొ పనిచేస్తున్నపుడు ఆయనతో కలసి పనిచేశారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది.

కొద్ది రోజుల కిందట ఒక వివాహానికి చెన్నైకి వచ్చిన బహదూర్ రజనీకాంత్ ని కలిశారు. రాజకీయాల్లోకి దూకాలా వద్దా అనే అంశం మీద రజనీ ఆయనతో చర్చించారు.
ఈ విషయం గుర్తు చేస్తూ, రజనీకాంత్ ఏడు కోట్ల తమిళ ప్రజలను నిరాశపర్చరనే అనుకుంటున్నానని బహదూర్ అన్నారు. “ నేనెపుడూ రజనీకాంత్ ఇంత టెన్షన్ లో చూడలేదు. ఎఐడిఎంకె నాయకురాలు జయలలిత మరణం తర్వాత, తమిళప్రజల భవిష్యత్తుగురించి రజనీకాంత్ తీవ్రంగా కలత చెందారు. రాజకీయాలలోకి రావాలని ఆయన మీద ప్రజలనుంచి, అభిమానుల నుంచి తీవ్రవత్తడి ఉంది,’అని బహదూర్ చెప్పారు.
“ వాళ్లతో పాటు, నేను కూడా, ఆయన ఒక సొంత పార్టీ ఏర్పాటుచేయాలనే కోరుకుంటున్నారు,’ అని బహదూర్ అన్నారు.
దేవుడు శాసిస్తే, రాజకీయాల్లోకి వస్తాను, అని రజనీ కాంత్ అన్నవారానికి బహూదర్ ఈ విషయాలు వెల్లడించడం వల్ల రజనీ రాజకీయాలలోకి రావడం ఖాయమనుకుంటున్నారు.
తమిళ మీడియా కథనాల ప్రకారం మే నెల 19న ఆయన క ప్రకటన చేసే అవకాశం ఉంది.
