తెలుగు తేజానికి చేదు అనుభవం

PV Sindhu slams airline ground staff for rude behaviour
Highlights

  • పీవీ సింధుకి చేదు అనుభవం
  • ఎయిర్ లైన్స్ సిబ్బందిపై మండిపడ్డ సింధు
  • తమ తప్పేమి లేదన్న ఎయిర్ లైన్స్ సిబ్బంది

బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం, రియో ఒలంపిక్ పతక విజేత పీవీ సింధుకి చేదు అనుభవం ఎదురైందట.  ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఒకరు ఆమెతో అనుచితంతగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ‘‘ చెప్పడానికే బాధగా ఉంది. నవంబర్ 4న హైదరాబాద్ నుంచి ముంబయికి 6ఈ608 ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా గ్రౌండ్ స్టాఫ్ అజితేజ్ నుంచి చేదు అనుభం ఎదురైంది’’ అని ఆమె ట్వీట్ చేశారు.

 

ఎయిర్ హోస్టెస్ అషిమా తో మాట్లాడితే.. మీకు పూర్తి విషయం తెలుస్తుంది అంటూ మరో ట్వీట్ కూడా సింధు చేశారు. ఆమె ట్వీట్ చేసిన కొద్ది సమయానికే.. ఆ ట్వీట్ వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారులు దీనిపై స్పందించారు. తమ విమాన సిబ్బంది ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పారు.  సిబ్బంది కేవలం వాళ్ల పని వారు నిర్వర్తించారని స్పష్టం చేశారు.

loader