Asianet News TeluguAsianet News Telugu

హిందూ ఆలయ ప్రవేశం కోసం అనుమతి తీసుకున్న ఏసుదాసు

  • హిందూ దేవులను కీర్తిస్తూ గీతాలు ఆలపించిన యేసుదాసు
  • హిందూ ఆయల ప్రవేశానికి అనుమతి కోోరిన యేసుదాసు
  • గతంలో రెండు ఆలయాల్లో ప్రవేశానికి నిరాకరణ
Portals of Padmanabha temple to be opened for Yesudas

కేరళ లోని సుప్రసిద్ధ పద్మానాభ స్వామి ఆలయాన్ని  ప్రముఖ గాయకుడు  కే జే ఏసుదాసు దర్శించుకోనున్నారు. ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆయనుకు న్యాయస్థానం అనుమతి కల్పించింది.  హిందూ దేవాలయాలను కేవలం హిందువులు మాత్రమే దర్శించుకోవాలనే నియమ నిబంధన ఉంది. పుట్టుకుతోనే క్రిస్టియన్ అయిన ఏసుదాసు.. గతంలో హిందూ ఆలయాల్లోకి అనుమతించలేదు. దీంతో ఆయన ఈ సారి పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు కోర్టు అనుమతి కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ ఆయనను లెటర్ పంపించారు.

 

ఏసుదాసు.. ప్రతి సంవత్సరం కేరళలోని అయ్యప్పస్వామి ఆలయానికి, కర్ణాటకలోని మూకాంబికా ఆలయాన్ని దర్శించుకుంటారు.అక్కడ ఎలాంటి ఆయన ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకోలేదు కానీ.. గురువయూర్ లోని శ్రీకృష్ణుని ఆలయానికి వెళితే..హిందువు కాదనే కారణంతో ఆయనను లోపలికి అనుమతించలేదు. అదేవిధంగా మలప్పురమ్ లోని దేవీ ఆలయంలోనూ ఇదే విధంగా జరిగింది. 

 

అందుచేత పద్మానాభ స్వామి ఆలయ దర్శనంలోనూ ఇదేవిధంగా జరుగుతుందేమో అని భావించిన ఏసుదాసు..న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్నారు. ఆయన అడిగినవెంటనే అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దసరా నవరాత్రల సందర్భంగా ఆయన స్వామి వారిని దర్శించుకోవాలనుకున్నారు. హిందువులు కానీ.. ఇతర దేశస్థులను కూడా ఆలయంలో ప్రవేశించేందుకు తాము అనుమతి కల్పిస్తామని ఆలయ అధికారులు చెప్పారు.

 

రోమన్ కాథలిక్ కుటుంబానికి చెందిన ఏసుదాసు.. సినిమాల్లో నేపథ్య గాయకుడిగా పనిచేస్తారు. పలు భక్తిరస గేయాలను ఆయన ఆలపించారు. ముఖ్యంగా హిందూ దేవులను కీర్తిస్తూ ఆయన ఆలపించిన గేయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios