Asianet News TeluguAsianet News Telugu

టాయిలెట్స్ మిస్సింగ్... పోలీసులు సర్చింగ్

Well Done Abba అనే హిందీ సినిమా చూశారా పోనీ, తెలుగులో పోసాని కృష్ణమురళి తీసిన రాజావారి చేపల చెరువు సినిమా అయినా చూశారా... చూడ లేదా... అయినా ఫర్వాలేదు ఈ వార్త చదవండి. అవినీతి పరుల ఆటను ఎలా కట్టించవచ్చో తెలుసుకోవచ్చు.

Police on the lookout of missing toilets

మన దేశంలో మరుగుదొడ్డిలో కూడా అవినీతి కంపేకొడుతోంది. ఆ కంపు భరించలేక ఓ మహిళ పోలీసులను కూడా ఆశ్రయించింది. అచ్చంగా ఓ బాలీవుడ్ సినిమాలో చూపించినట్లు చేసి అవినీతిపరుల బండారం బయటపెట్టింది.

 

వెల్ డన్ అబ్బా అనే హిందీ సినిమా చూశారా పోనీ, తెలుగులో పోసాని కృష్ణమురళి తీసిన రాజావారి చేపల చెరువు సినిమా అయినా చూశారా... చూడ లేదా... అయినా ఫర్వాలేదు ఈ వార్త చదవండి. అవినీతి పరుల ఆటను ఎలా కట్టించవచ్చో తెలుసోవచ్చు.

 

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ కు దగ్గర్లో అమర్‌పూర్‌ అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లో బేలాబాయ్‌ పటేల్‌, ఆమె కుమార్తె చందా నివసిస్తున్నారు. వారిద్దరూ ఓ కేసు పెట్టడానికి పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ఇప్పుడు ఆ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

 

వాళ్లు పెట్టిన కేసు ఏంటో తెలుసా... ?

 

తమ ఇంటి ముందు ఉన్న మరుగుదొడ్డి కనిపించడం లేదని, దొంగిలించబడిన తమ మరుగుదొడ్డిని కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం.

 

బేలాబాయ్‌ పటేల్‌, ఆమె కుమార్తె చందా కొన్నేళ్ల క్రితమే భర్తలను కోల్పోయారు. ఒకే ఊళ్లో వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్న వీరికి స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరయ్యాయి.

 

అయితే ఏడాది దాటిని వాటి నిర్మాణం మాత్రం జరగలేదు. దీంతో విషయం తెలుసకునేందుకు తల్లికుమార్తెలు సంబంధిత కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అధికారులు చెప్పింది విని షాక్ తిన్నారు. పేపర్లలో వారి ఇంటి ముందు మరుగుదొడ్ల నిర్మాణం ఎప్పుడో పూర్తైనట్లు ఉంది. వారికే కాదు ఆ ఊళ్లో ధరఖాస్తు చేసుకున్నవారందిరికీ మరుగుదొడ్లు నిర్మించారని ఉంది.

 

విషయం అర్థమైన ఆ తల్లికూతుళ్లు ఆ పేపర్లను సాక్ష్యంగా తీసుకొని తమ మరుగుదొడ్లు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

పోలీసులు కూడా విషయం అర్థం చేసుకొని మరుగుదొడ్లపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు వాటి కోసం సీరియస్ గానే గాలిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios