వైసీపీ నేతలకు డీజీపీ సాంబశివరావు శనివారం శుభవార్త వినిపించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రకు అనుమతి  ఇస్తారా.. ఇవ్వరా అనే సందిగ్ధానికి తెరపడింది. అనుమతి ఇస్తున్నట్లు డీజీపీ తాజాగా ప్రకటించారు.

ఇప్పటివరకు అనుమతి తీసుకోవాలని పోలీసులు.. అనుమతి అవసరం లేదంటూ వైపీసీ.. ఇరు వర్గాలు పంతాలకు పోవడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా జగన్ అభిమానులు ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రభుత్వం దిగి వచ్చింది.

ఈ విషయంపై డీజీపీ మీడియా మాట్లాడుతూ.. జగన్ ప్రజా సంకల్ప యాత్రకు అనుమతి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పాదయాత్ర రూట్ మ్యాప్ వివరాలను జిల్లాల ఎస్పీలకు అందజేస్తున్నట్లు కూడా చెప్పారు. దీంతో.. వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.