Asianet News TeluguAsianet News Telugu

స్మోకింగ్  అలవాటు చేసుకోవడానికి అసలు కారణాలు ఇవే..

  • పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’.. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఆ పొగని తాగకుండా మాత్రం ఉండలేరు. ఎందుకంటే.. కొందరేమో స్టేటస్ సింబల్ గా చెప్పుకుంటుంటే.. మరికొందరేమో.. టెన్షన్ రిలీఫ్ చేస్తుంది.. అందుకే తాగుతున్నాం అనే సమాధానాలు చెబుతున్నారు. కారణం ఏదైనా.. ఆ స్మోకింగ్ ని మాత్రం వదిలిపెట్టలేకపోతున్నారు
Peer influence doubles smoking risk for adolescents

స్మోకింగ్.. ఇదో ఫ్యాషన్ ప్రస్తుత కాలంలో. ఆడ,మగ, చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ దీనికి బానిసలౌతున్నారు. ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’.. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఆ పొగని తాగకుండా మాత్రం ఉండలేరు. ఎందుకంటే.. కొందరేమో స్టేటస్ సింబల్ గా చెప్పుకుంటుంటే.. మరికొందరేమో.. టెన్షన్ రిలీఫ్ చేస్తుంది.. అందుకే తాగుతున్నాం అనే సమాధానాలు చెబుతున్నారు. కారణం ఏదైనా.. ఆ స్మోకింగ్ ని మాత్రం వదిలిపెట్టలేకపోతున్నారు.  అసలు.. స్మోకింగ్ ఒక వ్యక్తికి ఎలా అలవాటౌతుంది? ఎలాంటి సంస్కృతిలో యువత దీనికి బానిసలౌతున్నారు?ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం..

Peer influence doubles smoking risk for adolescents

ప్రతి సంవత్సరం స్మోకింగ్ కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికా  వంటి దేశాల్లో 18 ఏళ్లకే యువత స్మోకింగ్ కి బానిసలౌతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్మోకింగ్ చేసే వారి సంఖ్య ఏ దేశాల్లో పెరుగుతుందో ఊహించగలరా? నిస్సందేహంగా వెస్ట్రన్ కంట్రీస్.. అనుకుంటే.. మీరు పొరపడినట్టే. ఎందుకంటే... వెస్ట్రన్ కంట్రీస్ తో పోలిస్తే.. కుటుంబ వ్యవస్థ ఎంతో బలంగా ఉండే ఇండియా, చైనా, జపాన్ వంటి దేశాల్లోనే ఎక్కువగా ఉంది. నమ్మడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం. ఒక వ్యక్తి స్మోకింగ్ కి అలవాటు పడుతున్నాడు అంటే.. అతని స్నేహితులు, కుటుంబీకులే కారణమట. ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Peer influence doubles smoking risk for adolescents

అమెరికా వంటి వెస్ట్రన్ కంట్రీస్ లో కుటుంబ వ్యవస్థ పెద్దగా బలంగా ఉండదు. ఎవరికివారు స్వతంత్ర్యంగా జీవితాన్ని గడుపుతుంటారు. కానీ భారత్ వంటి దేశాల్లో అలా కాదు. స్నేహితులు, చుట్టాలు, ఫ్యామిలీ ఇలా అందరితో కలిసి జీవిస్తుంటారు. వీరిలో ఒకరికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే.. వారి నుంచి మరొకరికి, ఆ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి స్మోకింగ్ అలవాటౌతోంది. ముఖ్యంగా 10 నుంచి 19 ఏళ్ల లోపు చిన్నారుల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. జియాయింగ్ లియు (పీహెచ్ డీ) దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపారు.

Peer influence doubles smoking risk for adolescents

ఇదే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా 16 దేశాల్లో పరిశోధనలు చేశారు. వాటిల్లో చైనా, సౌత్ కొరియా, జోర్డాన్, పోర్చుగల్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఉన్నాయి. వారి సర్వే ప్రకారం.. నాన్ వెస్ట్రన్ కంట్రీస్ లో ఈ స్మోకింగ్ ప్రభావం ఒకరి నుంచి మరొకరిపై ఉంది. ఒకేలాంటి అలవాట్లు, అభిరుచులు ఉన్నవాళ్లు త్వరగా స్నేహితులుగా మారతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ స్మోకింగ్ కూడా అలాంటిదే. ఇద్దరి వ్యక్తులను  ఫ్రెండ్స్ గా చేయడానికి కూడా ఇది సహకరిస్తుందట. ముఖ్యంగా సోషల్ ఇన్ ఫ్లూయెన్స్ ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే.. పొగతాగడం అలవాటు చేసుకొని ఆ తర్వాత.. దానిని మానడం కన్నా.. అసలు అలవాటు చేసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios