వర్మకి సవాల్ విసిరిన పవన్

First Published 21, Apr 2018, 10:31 AM IST
pawan new tweet challenge to director ramgopal varma
Highlights

బట్టలు విప్పి మాట్లాడుకుందాం రా.. అంటున్న పవన్

యాంకర్, నటి శ్రీరెడ్డి .. క్యాస్టింగ్ కూచ్ కి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ఒక్కసారిగా పక్కదారి పట్టింది. ఎప్పుడైతే శ్రీరెడ్డి సినీ నటుడు పవన్ కల్యాణ్ ని, ఆయన తల్లిని దూషించిందో.. ఈ విషయం సంచలనంగా మారింది. కాగా.. ఉద్యమం కాస్త.. వ్యక్తుల మధ్య మాటల యుద్ధంగా మారింది. తీరా ఈ వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హస్తం కూడా ఉండటంతో.. మరింత వివాదానికి దారి తీసింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ రోజు ఉదయం రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పవన్ ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ‘‘నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్‌ చేయనని మా మదర్‌ మీద ఒట్టు వేశా. ఆ తర్వాత కూడా నేను, సీబీఎన్‌, లోకేష్‌, శ్రీనిరాజు, ఆర్కే, రవి ప్రకాష్‌, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడం మూలాన మా మదర్‌ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టుమీద పెట్టాను’’ అని ట్వీట్‌ చేశారు.

 

కాగా.. ఈ ట్వీట్ కి పవన్ కూడా తనదైన శైలీలో ట్విట్టర్ లో సమాధానం చెప్పారు. రామ్ గోపాల్ వర్మకి సవాల్ విసిరారు. ‘బట్టలు విప్పి మాట్లాడుకుందాం రా’ అంటూ ట్వీట్ చేశారు. అయితే పవన్ ట్వీట్లు నిజంగా ఆర్జీవీ గురించేనా లేక.. మంత్రి లోకేష్ గురించా అంటూ చర్చలు మొదలయ్యాయి. ఉదయం నుంచి పవన్ వరస ట్వీట్లు చేస్తూనే ఉండటం గమనార్హం.

loader