టీఆర్పీల కోసం నా తల్లిని దూషించారు...నేను చావడమే నయం

టీఆర్పీల కోసం నా తల్లిని దూషించారు...నేను చావడమే నయం

యాంకర్, నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ తల్లిని దూషిస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే.కాగా..ఆమె వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. పవన్ అభిమానులు అయితే ఏకంగా  శ్రీరెడ్డిపై పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. తాజాగా పవన్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.కొందరు రాజకీయ లబ్ధి కోసం, టీఆర్పీ రేటింగ్ ల కోసమే ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆయన మండి పడ్డారు.

‘నాపై ఆరోపణలు చేస్తున్నవారికి, చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారు. కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీఆర్‌పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న నా 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారు. మీరంతా టీఆర్‌పీల కోసం షోలు నిర్వహిస్తున్నారు కదా? మంచిది. వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను. నేను నటుడి కంటే ముందు, రాజకీయ నేత కంటే ముందు ఓ అమ్మకు బిడ్డను. ఓ కొడుకుగా నా తల్లి గౌరవాన్ని కాపాడుకోలేకపోతే బతకడం కంటే చావడం మంచిది. మీరంతా కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, అక్కచెల్లెళ్లకి, మీ కూతుళ్లకి, కోడళ్లకి మీ ఇంటిల్లిపాదికీ నా హృదయపూర్వక వందనాలు. ఆత్మగౌరవంతో బతికేవాడు.. ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే.. అసలు దేనికన్నా భయపడతాడా? వెనుకంజ వేస్తాడా? ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos