శ్రీరెడ్డిని పరుగులు పెట్టించిన పవన్ అభిమానులు

pawan kalyan fans hunted anchor sri reddy in hyderabad
Highlights

శ్రీరెడ్డికి చుక్కలు చూపించారు.

యాంకర్, నటి శ్రీరెడ్డికి పవన్ అభిమానులు గత రాత్రి చుక్కలు చూపించారు. జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్‌లో చర్చావేదికలో పాల్గొనేందుకు శ్రీరెడ్డి వచ్చిన విషయం తెలుసుకొన్న పవన్‌కల్యాణ్‌ అభిమానులు అక్కడికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితి సృష్టించారు. ఆమె ఇంటికి వెళ్తుండగా వాహనాన్ని వెంబడిచారు. చివరికి పోలీసులు జోక్యంచేసుకుని ఆమెను ఇంటి వద్ద దిగబెట్టారు.


ఇటీవల శ్రీరెడ్డి మీడియా ముందు పవన్ కళ్యాణ్ ని అభ్యంతరకర పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పట్ల పవన్ అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు. ఎప్పుడు దొరుకుతుందా దాడి చేయడానికి అని ఎదురుచూస్తున్నారు.

కాగా..మంగళవారం రాత్రి శ్రీరెడ్డి టీవీ కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న పవన్‌ అభిమానులు పెద్దసంఖ్యలో ఆ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్సై సైదా తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని నియంత్రించారు. రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో ఆమెను కారులో మరో మార్గంలో ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. ఇది గుర్తించిన పవన్‌ అభిమానులు కారును వెంబడించారు. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ శ్రీరెడ్డిని నేరుగా జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఠాణాలో కాసేపు కూర్చోబెట్టి, తర్వాత పోలీసు వాహనంలో హుమాయన్‌నగర్‌ ఠాణా పరిధిలోని ఆమె ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఈ సంఘటనలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టారు.

loader